News August 9, 2024
HYD: అర్హులకే అసైన్డ్ భూములు: భట్టి విక్రమార్క
ఇందిరాగాంధీ కాలంలో భూమి లేని పేదలకు పంచిన ఆసైన్డ్ భూములు తిరిగి అర్హులకే చెందేలా చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భరోసానిచ్చారు. మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నాదర్‌గుల్ రైతులు ప్రగతిభవన్‌లో డిప్యూటీ సీఎంను కలిసి తమకు కేటాయించిన భూములను కొంతమంది ప్రైవేటు వ్యక్తులు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని పిర్యాదు చేశారు. తగిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం తెలిపారు.
Similar News
News January 20, 2025
HYD: 10TH, ఇంటర్, ITI, డిగ్రీ వారికి బెస్ట్ ఛాన్స్
HYD నాంపల్లి పరిధి మల్లేపల్లి ITI కాలేజీలో నేషనల్ ఇంటర్న్‌షిప్ మేళా నేడు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు జరగనుందని అధికారులు తెలిపారు. 5వ తరగతి నుంచి 12 వరకు పాసైన వారు, ITI, బీటెక్ డిగ్రీ, ఇతర డిగ్రీలు చేసినవారికి ఇంటర్న్‌షిప్ అందించి, ఉద్యోగాలు కల్పించనున్నారు. 1000కి పైగా కంపెనీలు ఇందులో పాల్గొంటారని, అన్ని జిల్లాల అభ్యర్థులు ధ్రువపత్రాలతో హాజరుకావాలని,ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News January 20, 2025
సందర్శకులతో కిక్కిరిసిన నాంపల్లి నుమాయిష్
నాంపల్లి ఎగ్జిబిషన్ ఆదివారం సందర్శకులతో కిక్కిరిసింది. ఒక్కరోజే 65 వేల మంది వచ్చినట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు నిరంజన్ వెల్లడించారు. వివిధ స్టాళ్ల వద్ద తమకు నచ్చినవి కొనుగోలు చేస్తూ పిల్లలతో సరదాగా గడిపారు. దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన ఉత్పత్తులను ఇక్కడ అందుబాటులో ఉంచడంతో ప్రజలు ఆసక్తి కనబరిచారు.
News January 20, 2025
కేజ్రీవాల్‌పై అంబర్‌పేట్ వాసి పోటీ..!
HYD అంబర్‌పేట్ వాసి దుగ్గిరాల నాగేశ్వరరావు న్యూఢిల్లీ 40వ అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఆప్ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై ఆయన పోటీ చేస్తున్నారు. ఈ మేరకు జాతీయ జనసేన పార్టీ తరఫున ఆయన నామినేషన్ దాఖలు చేశారు. తిరుపతిలో విద్యాభ్యాసం చేసిన నాగేశ్వరరావు అంబర్‌పేట్‌లో ఉంటున్నారు. తన పార్టీ గుర్తు గ్రీన్ చిల్లి అని తెలిపారు. ఇటీవల ఆయన వయనాడ్‌లో ప్రియాంకా గాంధీపై పోటీ చేశారు.