News September 8, 2024

HYD: అలా చేస్తే.. ఏడు జిల్లాల్లో ఆక్రమణలకు చెక్!

image

HYD నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతల పై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏ మాత్రం తగ్గటం లేదు. దీంతో HMDA పరిధిలోని 7 జిల్లాల్లో చెరువుల పరిరక్షణ కోసం లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఛైర్మన్ బాధ్యతలను సైతం హైడ్రాకు అప్పగించడంపై ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇదే కాని జరిగితే.. HYD, సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్, గజ్వేల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో చెరువుల ఆక్రమణలకు చెక్ పడనుంది.

Similar News

News November 29, 2025

కూకట్‌పల్లిలో యాక్సిడెంట్.. ఒకరి మృతి

image

కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చెట్లకు నీళ్లు పోస్తున్న ట్యాంకర్ డ్రైవర్‌ను అతివేగంగా వచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సదరు వ్యక్తి తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. కారు డ్రైవర్ మద్యం సేవించి డ్రైవింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News November 29, 2025

టాక్స్ ఎవేడర్లకు షాక్.. GHMC, HMWSSB ఉమ్మడి సర్వే!

image

ప్రాపర్టీ టాక్స్ వసూళ్లను పెంచేందుకు TGSPDCL డేటా ఆధారంగా GHMC విస్తృత సర్వే చేపడుతోంది. రెసిడెన్షియల్, సెమీ- రెసిడెన్షియల్, కమర్షియల్ బిల్డింగ్స్ గుర్తించే ఈ సర్వేకు సంబంధించి, HMWSSB కూడా GHMCని సంప్రదించింది. ఈ ఎక్ససైజ్ ద్వారా కనీసం 200 కోట్లు ఆదాయం పెరుగుతుందని వాటర్ బోర్డ్, GHMC అధికారులు Way2Newsకు తెలిపారు.

News November 29, 2025

HYD: కొడుకుతో కలిసి భర్తను చంపిన భార్య (UPDATE)

image

బోడుప్పల్‌లో భర్తను భార్య దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. స్థానికుల ప్రకారం.. అంజయ్య‌(55)కు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. నెల క్రితం కూతురి వివాహమైంది. పుట్టింట్లో ఉంది. గురువారం రాత్రి భార్య బుగమ్మ, కుమారుడు రాజు, బంధువు శేఖర్‌తో కలిసి అంజయ్య మద్యం తాగారు. అర్ధరాత్రి ముగ్గురు అతడి మెడకు చున్నీ బిగించి హతమార్చారు. కూతురు అడ్డుకోగా గదిలో బంధించారు. పోలీసులకు ఫిర్యాదుతో వెలుగులోకొచ్చింది.