News February 10, 2025
HYD: అలా చేస్తే.. మీ భరతం పడతాం: హైడ్రా

HYD నగరం సహా, ORR వరకు అనుమతులు లేకుండా రోడ్లపై, రోడ్లకు ఇరుపక్కలా ప్రకటన బోర్డులు ఏర్పాటు చేస్తే వారి భరతం పడతామని హైడ్రా హెచ్చరించింది. ఇటీవల శంషాబాద్లో భారీ హోర్డింగ్ తొలగించినట్లు దీనికి ఉదహరించింది. ఎక్కడైనా ప్రమాదకరమైన హోర్డింగులు ఉంటే తమ దృష్టికి తేవాలని హైడ్రా కోరింది. ఎక్కడికక్కడ కఠిన చర్యలు అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చింది.
Similar News
News December 1, 2025
వ్యవసాయం కుదేలవుతుంటే చోద్యం చూస్తున్న CBN: జగన్

AP: వ్యవసాయం కుప్పకూలిపోతుంటే CM CBN రైతులను వారి విధికి వదిలేసి చోద్యం చూస్తున్నారని YCP చీఫ్ YS జగన్ మండిపడ్డారు. ‘హలో ఇండియా! AP వైపు చూడండి. అక్కడ KG అరటి ₹0.50 మాత్రమే. ఇది నిజం. రైతుల దుస్థితికిది నిదర్శనం. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లభించడం లేదు. మా హయాంలో టన్ను అరటికి 25వేలు ఇచ్చాం. రైతులు నష్టపోకుండా ఢిల్లీకి రైళ్లు ఏర్పాటుచేశాం. కోల్డ్ స్టోరేజీలు పెట్టాం’ అని Xలో పేర్కొన్నారు.
News December 1, 2025
నిర్మల్: డీఎడ్ పరీక్షకు 83 మంది హాజరు

నిర్మల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల కస్బాలో జరుగుచున్న డీఎడ్ మొదటి సంవత్సరం పరీక్షలకు 93 మంది విద్యార్థులకు గాను 83 మంది విద్యార్థులు హాజరుకాగా పదిమంది గైరాజరయ్యారని డీఈవో భోజన్న తెలిపారు. పరీక్ష కేంద్రాన్ని పాఠశాల విద్యాశాఖ వరంగల్ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు కే సత్యనారాయణ రెడ్డి, నిర్మల్ ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ ముడారపు పరమేశ్వర్ సందర్శించారు.
News December 1, 2025
తణుకులో గుర్తుతెలియని మృతదేహం కలకలం

తణుకు పట్టణంలో సోమవారం గుర్తు తెలియని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. రాష్ట్రపతి రోడ్డులోని కోర్టు సమీపంలో సుమారు 50 ఏళ్లు వయసు కలిగిన మృతదేహం ఉన్నట్లు స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు స్థానికంగా యాచకం చేస్తుంటాడని స్థానికులు చెబుతున్నారు. మృతదేహాన్ని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.


