News February 10, 2025
HYD: అలా చేస్తే.. మీ భరతం పడతాం: హైడ్రా

HYD నగరం సహా, ORR వరకు అనుమతులు లేకుండా రోడ్లపై, రోడ్లకు ఇరుపక్కలా ప్రకటన బోర్డులు ఏర్పాటు చేస్తే వారి భరతం పడతామని హైడ్రా హెచ్చరించింది. ఇటీవల శంషాబాద్‌లో భారీ హోర్డింగ్ తొలగించినట్లు దీనికి ఉదహరించింది. ఎక్కడైనా ప్రమాదకరమైన హోర్డింగులు ఉంటే తమ దృష్టికి తేవాలని హైడ్రా కోరింది. ఎక్కడికక్కడ కఠిన చర్యలు అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చింది.
Similar News
News February 12, 2026
భీమవరంలో అన్న క్యాంటీన్‌ని పరిశీలించిన జేసీ

భీమవరం పాత బస్టాండ్ వద్ద నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్‌ను గురువారం జేసీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పేదలకు రూ.5లకే నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. క్యాంటీన్‌లోని భోజన పంపిణీ, తాగునీరు, సర్వింగ్ ప్రాంతాలను పరిశీలించిన ఆయన.. వాష్ ఏరియాను నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలని నిర్వాహకులను ఆదేశించారు.
News February 12, 2026
NTR: మొదలైన “బిట్స్” క్యాంపస్ పనులు.. మంత్రి లోకేశ్ ట్వీట్

అమరావతిలో బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ& సైన్స్(బిట్స్) సంస్థ క్యాంపస్ నిర్మాణ పనులు మొదలయ్యాయంటూ మంత్రి లోకేశ్ గురువారం ట్వీట్ చేశారు. కాగా మందడం, వెంకటపాలెంలో క్యాంపస్ నిర్మాణానికి ఆ సంస్థకు 70 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. తొలి దశలో రూ.1,000 కోట్లతో అమరావతిలో బిట్స్ క్యాంపస్ నిర్మిస్తుండగా..AI, ఆవిష్కరణలకు అమరావతి కేంద్రంగా మారుతోందని లోకేశ్ పేర్కొన్నారు.
News February 12, 2026
అనకాపల్లి: యువతిని మోసగించి.. రూ.4 లక్షలు కొట్టేశారు

నర్సీపట్నంలో సైబర్ నేరగాళ్లు ఒక యువతని మోసగించి రూ. 4 లక్షలు కొట్టేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. టౌన్ సీఐ షేక్ గఫూర్ కథనం ప్రకారం.. రామారావుపేటకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని, ఉద్యోగాల కోసం ఇంస్టాగ్రాం శోధిస్తుండగా ఆమెకు ఒక లింక్ వచ్చింది. ప్రోడక్ట్ చూసి వాయిస్ ఓవర్ ఇస్తే రూ. 100 ఇచ్చేవారు. భారీ మొత్తంలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి ఆమె నుంచి డబ్బులు కొట్టేశారని సీఐ తెలిపారు.


