News December 28, 2024

HYD: అవగాహనతోనే మదకద్రవ్యాల నిర్మూలన: సందీప్ శాండిల్య

image

అవగాహనతో మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉందని టీజీఏఎన్‌బీ డైరెక్టర్ సందీప్ శాండిల్య అన్నారు. శనివారం ‘డ్రగ్-ఫ్రీ వెల్‌నెస్’ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఎడిస్టీస్ ఫౌండేషన్, క్రియేట్ ఎడ్యుటెక్‌లతో సహకార ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ మార్గదర్శకాలతో ఆన్‌లైన్ ప్రోగ్రామ్ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు.

Similar News

News January 4, 2025

HYD: లగచర్ల కేసులో సురేష్, శివ కస్టడీకి అనుమతి

image

లగచర్ల కేసులో నిందితుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రధాన సూత్రధారి సురేష్ ,శివకు మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. మిగతా నిందితులకు సంబంధించి మాంగ్యా నాయక్, లోక్యా నాయక్ కస్టడీ విచారణ సోమవారానికి వాయిదా వేసింది. ఇద్దరు నిందితుల తరుపున కౌంటర్ ధాఖలు న్యాయవాది వేశారు. కౌంటర్ పై సోమవారం వాదనలు కొనసాగనున్నాయి.

News January 3, 2025

HYD: ప్రమాణ పత్రం ఇవ్వాలనే దిక్కుమాలిన రూల్ ఏంటి: కేటీఆర్

image

రాష్ట్రంలో ప్రమాణ పత్రం ఇస్తేనే రైతు భరోసా ఇస్తామని ప్రభుత్వం చెబుతోందని.. అదేం దిక్కుమాలని రూల్ అని మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన తెలంగాణ భవన్‌ లో మీడియాతో మాట్లాడుతూ.. రైతు శాసించేలా కేసీఆర్ చూశారని.. నేడు రైతులు యాచించేలా కాంగ్రెస్ సర్కార్ చేస్తోందని ఆరోపించారు. ఇప్పటికే రైతుబంధు ఒక సీజన్ ఎగ్గొట్టారని.. అది కూడా రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

News January 3, 2025

HYD: పోలీసులకు ప్రత్యేక శిక్షణ: డీజీపీ

image

ఇద్దరు అంతర్జాతీయ క్రీడాకారులు టీజీఎస్పీలో చేరారని తెలంగాణ డీజీపీ జితేందర్ అన్నారు. ఒకరు నిఖత్ జరీన్, మరొకరు మహమ్మద్ సిరాజ్ అని చెప్పారు. వీళ్లను సద్వినియోగం చేసుకునేందుకు ప్రత్యేక ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదిస్తున్నామని, పోలీస్ ట్రైనింగ్‌లో భాగంగా బాక్సింగ్, క్రికెట్‌పై కూడా ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆటగాళ్లను కూడా తయారు చేయాలన్నది ఆశయంగా పెట్టుకున్నామన్నారు.