News February 7, 2026

HYD: అవినీతికి నిలయంగా GHMC ‘ఇంజినీరింగ్‌’ విభాగం..?

image

GHMCలో అత్యధిక అవినీతి విభాగంగా ఇంజినీర్ విభాగం మారింది. ఓవైపు ఏసీబీ దాడులు జరుగుతున్న.. వారిలో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. ఒక్కో టెండర్‌కు ఒక్కో నిబంధనలో పెడుతూ కాంట్రాక్టర్లను ముప్పుతిప్పలు పెడుతున్నారు. డబ్బులు ఇస్తేనే పని జరుగుతుంది అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు కొందరు లంచాలకు కక్కుర్తి పడి అనుమతులు ఇస్తున్నారు. వీటికి ఇప్పటివరకు జరిగిన ఏసీబీ దాడులే నిదర్శనం.

Similar News

News March 17, 2026

HYD: ఫ్లోర్ కడిగినందుకు రూ.5వేల FINE

image

HYDలో తాగునీటి దుర్వినియోగంపై HMWSSB కఠినచర్యలు చేపట్టింది. జూబ్లీహిల్స్‌ వాసి తాగునీటితో ఫ్లోర్లు కడుగుతుండగా గుర్తించి రూ.5వేల జరిమానా విధించారు. ప్రజల నుంచి వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. తాగునీటిని వృథా చేస్తే కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు.

News March 17, 2026

HYD: భారీగా పెరిగిన ధరలు.. అడ్డుకోరా!

image

వాణిజ్య గ్యాస్ కొరత సాకుతో నగరంలో హోటల్ తిండి హోరెత్తుతోంది. టీ కప్పు నుంచి టిఫిన్ ప్లేట్ దాకా HYDలో ₹5- ₹10 వరకు పెంచేసిన హోటళ్లు.. గ్యాస్ సరఫరా చక్కబడినా ధరలు తగ్గిస్తారన్న గ్యారెంటీ లేదని ప్రజలు వాపోతున్నారు. గతంలో ధరలు పెరిగినా మళ్లీ కిందికి రాలేదు. ఉదాహరణకి ‘ఆనియన్ సలాడ్’! ఈ భారమంతా ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన విద్యార్థులు, మధ్యతరగతి జీవుల మీదే పడుతోందంటున్నారు. ఈ దోపిడీని అడ్డుకోరా?

News March 17, 2026

HYD: మెట్రో ఆస్తులు గుట్టుగా ప్రైవేట్ పరం!

image

మెట్రోను సర్కార్ తీసుకునేలోపే ఆస్తులన్నీ PVT బాబులకు కట్టబెట్టే ప్లాన్ పక్కాగా అమలైతోంది. రాయ్‌దుర్గ్, అమీర్‌పేట్ సహా మెయిన్ స్టేషన్లలోని ఖరీదైన కమర్షియల్ స్థలాలు ప్రభుత్వానికి హ్యాండోవర్ చేయకముందే కావాల్సిన సంస్థలకు 15- 20 ఏళ్లకు లీజుకు ఇచ్చేశారు. అంటే రేపు మెట్రో పబ్లిక్ ప్రాపర్టీ అయినా అక్కడ వచ్చే కిరాయిలు మాత్రం ప్రైవేటు బాబుల జేబుల్లోకి వెళ్తాయి. తాజాగా జరిగిన లీజ్ డీడ్స్‌తో బాగోతం బయటపడింది.