News February 10, 2025
HYD: అవి FAKE జాగ్రత్త..!: T-Hub

నగరంలోని T-hub పేరిట నకిలీ వెబ్ సైట్, నకిలీ మొబైల్ యాప్ పట్ల అప్రమత్తంగా ఉండాలని T-hub సూచించింది. https://thubeco, logical.com/login లాంటి ఫేక్ వెబ్ సైట్, యాప్ పట్ల కొందరు మోసగాళ్లు బురిడీ కొట్టించే కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు పేర్కొంది. పెట్టుబడులు, చెల్లింపుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
Similar News
News February 8, 2026
NTR: ఫైన్లు మాత్రం వేస్తారు.. ఫిర్యాదు ఇస్తే పట్టించుకోరా?

తన బైక్ పోతే కనిపెట్టలేకపోయారు కానీ.. ఫైన్లు మాత్రం వేస్తున్నారంటూ ఓ యువకుడు ఆదివారం సీపీ కార్యాలయం వద్ద నిరసనకు దిగాడు. నాలుగేళ్ల క్రితం బైక్ పోయిందని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని, ఇప్పుడు కొత్త బైక్‌పై వెళ్తుంటే హెల్మెట్ లేదని జరిమానాలు వేస్తున్నారని ఫ్లెక్సీతో నిరసన తెలిపాడు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని టూటౌన్ స్టేషన్‌కు తరలించారు.
News February 8, 2026
వనపర్తి: ఫిబ్రవరి 11న యథావిధిగా ఇంటర్ ప్రాక్టికల్స్

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి 11న విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినప్పటికీ, ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు మాత్రం షెడ్యూల్ ప్రకారం యథావిధిగా జరుగుతాయని వనపర్తి డీఐఈవో (DIEO) అంజయ్య స్పష్టం చేశారు. ఇంటర్ బోర్డ్ కార్యదర్శి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రాక్టికల్స్ ఉన్న విద్యార్థులు ఎలాంటి గందరగోళానికి గురికాకుండా తమ కేటాయించిన కేంద్రాలకు హాజరు కావాలని సూచించారు.
News February 8, 2026
చిత్తూరు: వృద్ధురాలి దారుణ హత్య

గుడిపల్లి (M) ON కొత్తూరు సమీపంలోని ఇటుకల బట్టీ వద్ద ఆదివారం చిన్నక్క (70) ఆనే వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. గుర్తు తెలియని వ్యక్తులు ఆమె గొంతుతో పాటు చెవులను సైతం కోసి దారుణంగా హత్య చేశారు. ఇటుకల బట్టీలో వృద్ధురాలి మృతదేహం పడి ఉండడాన్ని ఇటుకల కోసం వచ్చిన వారు చూసి స్థానికులకు సమాచారం అందించారు. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


