News May 10, 2024
HYD: అశ్లీల నృత్యాలు.. ఆఫ్టర్ 9 పబ్ సీజ్

బంజారాహిల్స్ రోడ్ నంబర్ 8లో ఉన్న ఆఫ్టర్ 9 పబ్‌ని అమీర్‌పేట ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడమే కాకుండా ఎలాంటి అనుమతి లేకుండా పబ్ కొనసాగుతోందని దర్యాప్తులో తేలింది. కొద్దిరోజుల కిందట పోలీసులు చేసిన దాడిలో 162 మంది యువతీ యువకులతో అశ్లీల నృత్యాలు చేయిస్తూ యాజమాన్యం పోలీసులకు చిక్కిన సంగతి తెలిసిందే.
Similar News
News March 9, 2026
రంగారెడ్డి జిల్లాలో రైతు రిజిస్ట్రేషన్ 88% పూర్తి

రంగారెడ్డి జిల్లా పరిధిలో రైతుల రిజిస్ట్రేషన్ ప్రక్రియపై అధికారులు ఫోకస్ చేశారు. జిల్లాలో మొత్తం 1,97,029 మంది రైతులు ఉండగా ఇప్పటివరకు 88% రిజిస్ట్రేషన్ మాత్రమే పూర్తైనట్లుగా అధికారులు తెలిపారు. పీఎం కిసాన్ లాంటి పథకాలు అందాలంటే రైతుల రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
News March 9, 2026
రంగారెడ్డి: జిల్లాలో తొలిరోజు 139 మందికి వ్యాక్సిన్

హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. తొలి రోజులో భాగంగా రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 139 మంది బాలికలకు వ్యాక్సిన్ వేశారు. కొండాపూర్ జిల్లా ఆస్పత్రిలో 19 మంది, వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో 10, రాజేంద్రనగర్‌లో 30, హయత్‌నగర్‌లో 10, శంషాబాద్‌లో 20, చేవెళ్లలో 22, షాద్‌నగర్‌లో 17, మహేశ్వరంలో ఏడుగురు బాలికలకు వ్యాక్సిన్ వేశారు.
News March 9, 2026
నగరంలో పెరుగుతున్న భగభగలు

నగరంలో వారం రోజులుగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి. సాధారణంగా ఏప్రిల్ మధ్యలో కనిపించే వేడి, మార్చి మొదటి వారంలోనే సెగలు పుట్టిస్తోంది. ఆదివారం నాటికి గరిష్ఠ ఉష్ణోగ్రతలు 34 నుంచి 37 డిగ్రీల మధ్య నమోదు కాగా.. రానున్న వారం రోజుల్లో 40 డిగ్రీల మార్కును దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది.


