News August 10, 2024

HYD: అసెంబ్లీ స్పీకర్‌పై అనుచిత పోస్టులు.. నిందితుడి ARREST

image

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై అనుచిత వాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వికారాబాద్‌కు చెందిన విజయ్‌ను HYD సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ మాట్లాడిన వీడియోలను సేకరించి కించపరిచేలా పోస్టులు చేశాడని పోలీసులు తెలిపారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టా, ట్విట్టర్ వంటి సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా ఉందని హెచ్చరించారు.

Similar News

News February 9, 2026

HYDలో తీవ్ర విషాదాలు..!

image

HYDలో వరుస ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. చర్లపల్లిలో పిల్లలతో కలిసి విజయారెడ్డి డిప్రెషన్‌తోనే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తేల్చారు. దీనికి ముందు యువతి డిప్రెషన్‌తో ట్యాంక్‌బండ్‌లో దూకింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సతీశ్ పనిఒత్తిడితో ఉరేసుకున్నాడు. కూకట్‌పల్లిలో వివాహిత అనిత అనారోగ్యంతో మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకుంది. ఒత్తిడికి గురైతే పిల్లలు, తల్లిదండ్రులతో గడపాలని నిపుణులు చెబుతున్నారు.

News February 9, 2026

హైదరాబాద్‌ మెట్రో.. క్రియేటివ్ రీల్స్ అడ్డా!

image

HYD మెట్రో రైళ్లు కేవలం ప్రయాణానికే కాదు, యువత క్రియేటివిటీకి సరికొత్త వేదికలుగా మారుతున్నాయి. రాయదుర్గం నుంచి ఎల్బీనగర్ వరకు సాగే ప్రయాణంలో రీల్స్ షూటింగ్‌లు, సోషల్ మీడియా కంటెంట్ రూపకల్పనతో కుర్రకారు హల్చల్ చేస్తోంది. క్లబ్‌లు, కేఫ్‌ల కంటే మెట్రోలోనే నెట్‌వర్కింగ్ జోన్లు వెలుస్తున్నాయి. ప్రయాణ సమయాన్ని వృథా చేయకుండా వైరల్ వీడియోలు సృష్టిస్తూ మెట్రోను ఒక క్రియేటర్ స్టూడియోగా మార్చేస్తున్నారు.