News July 11, 2024
HYD: ఆగస్టు 5న స్టాండింగ్ కమిటీ ఎన్నిక

బల్దియా స్టాండింగ్ కమిటీ సభ్యురాలిగా ఉన్న షాహిన్ బేగం మరణంతో ఖాళీ అయిన స్థానాన్ని భర్తీ చేసేందుకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 12 నుంచి 22 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అర్హత పొందిన నామినేషన్ల వివరాలు 23న వెలువరిస్తారు. ఉపసంహరణ గడుపు 26వ తేదీ వరకు ఉంటుంది. ఆగస్టు 5న పోలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News November 22, 2025
HYDలో అతి పెద్ద పౌల్ట్రీ ఎక్స్పో

దక్షిణాసియాలోనే అతిపెద్ద పౌల్ట్రీ ఈవెంట్ ‘పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్-2025’కు భాగ్యనగరం ఆతిథ్యం ఇవ్వనుంది. నవంబర్ 25 నుంచి హైటెక్స్‌లో ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (IPEMA) ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఈ అంతర్జాతీయ ఎక్స్పో జరగనుంది. సుమారు 50 దేశాల నుంచి 500కు పైగా ఎగ్జిబిటర్లు, 40వేల మంది సందర్శకులు హాజరుకానున్నారు. సస్టెయినబుల్ ఫీడ్, ఆటోమేషన్ వంటి అంశాలపై చర్చిస్తారు.
News November 22, 2025
HYD: పైలట్‌పై అత్యాచారయత్నం

అత్యాచారయత్నం చేసినట్లు బాధితురాలు HYDలోని బేగంపేట PSలో ఫిర్యాదు చేసింది. ఓ ఏవియేషన్ సంస్థకు చెందిన కమర్షియల్ పైలట్ రోహిత్ శరణ్ (60) సహోద్యోగి అయిన యువతిపై బెంగళూరులో అత్యాచారయత్నం చేశాడు. సంస్థ పని నిమిత్తం బెంగళూరు వెళ్లిన సమయంలో హోటల్ గదిలో ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు, సంఘటన బెంగళూరు హలసూరు పోలీస్ స్టేషన్ పరిధి కావడంతో కేసును అక్కడికి బదిలీ చేశారు.
News November 22, 2025
HYD: పెళ్లి కావట్లేదని అమ్మాయి చనిపోయింది..!

ఓ యువతి సూసైడ్ చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. సిద్దిపేట(D) మద్దూర్(M) రేబర్తి వాసి కుంటి నిరోష(32) సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తోంది. చింతల్ పద్మానగర్‌లో తన సోదరుడు నరేశ్‌తో కలిసి ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. ఆమెకు కొంతకాలంగా ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దీనికి తోడు పెళ్లి కావట్లేదు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లో ఉరేసుకుని చనిపోయింది. కేసు నమోదైంది.


