News October 16, 2024
HYD: ఆటోలో అత్యాచారం.. డ్రైవర్ అరెస్ట్
గచ్చిబౌలి PS పరిధిలో సోమవారం అర్ధరాత్రి జరిగిన అత్యాచారం కేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఆటో డ్రైవర్ ప్రవీణ్‌ను లింగంపల్లిలో అదుపులోకి తీసుకున్నారు. సోమవారం RCపురంలో బస్సు దిగిన యువతి(32) నానక్‌రాంగూడకు వెళ్లేందుకు ఆటో ఎక్కింది. ఆమెపై కన్నేసిన డ్రైవర్ HCU సమీపంలోని మసీద్ బండ వద్ద అత్యాచారం చేసి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదైంది. తాజాగా నిందితుడిని అరెస్ట్ చేశారు.
Similar News
News November 5, 2024
నేడు కాచిగూడలో రాష్ట్ర స్థాయి బీసీ విద్యార్థి సదస్సుకు
కాచిగూడలోని అభినందన్ గ్రాండ్‌లో నేడు నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి బీసీ విద్యార్థుల సదస్సుకు భారీ ఏర్పాట్లు చేశారు. కాచిగూడ పరిసర ప్రాంతాలను రాత్రింబవళ్లు విద్యార్థులు కష్టపడి బీసీ జెండాలతో అలంకరించారు. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ అధ్యక్షతన ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సదస్సుకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు.
News November 5, 2024
HYD: రేపటి నుంచి సర్వే.. ఇవి దగ్గర ఉంచుకోండి!
సమగ్ర ఇంటింటి సర్వే రేపటి నుంచి ప్రారంభం కానుంది. 56 ప్రధాన, 19 అనుబంధ మొత్తం కలిపి 75 ప్రశ్నలుంటాయి. ఆధార్ కార్డులు, రైతులయితే అదనంగా ధరణి పాసుపుస్తకాలు, రేషన్ కార్డు, ఇంటి పన్ను రసీదు దగ్గర పెట్టుకుంటే సర్వే సులువుగా పూర్తవుతుంది. సర్వేలో ఫొటోలు తీయడం, పత్రాలు అడగం వంటివి చేయరు. సేకరించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచుతారు.
News November 5, 2024
HYD: ప్రజలు అన్నీ తెలుసుకుంటున్నారు
హైదరాబాదులో ఇప్పుడు ఇల్లు, స్థలం కొనుగోలు చేసేవారు అన్ని జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేస్తున్నారని పర్యావరణవేత్త పురుషోత్తం రెడ్డి పేర్కొన్నారు. బుద్ధభవన్‌లోని హైడ్రా కార్యాలయంలో కమిషనర్ రంగనాథ్‌తో ఆయన సమావేశమయ్యారు. ప్రభుత్వ శాఖలన్నీ సహకరించినప్పుడే హైడ్రా సత్ఫలితాలు ఇస్తుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. FTL, బఫర్ జోన్, క్యాచ్‌మెంట్ ఏరియా అంటే ఏమిటో ప్రజలు తెలుసుకుంటున్నారన్నారు.