News July 3, 2024

HYD: ఆడుకుంటూ వెళ్లి రైలెక్కారు.. పోలీసుల చేరదీత 

image

బుద్వేల్ రైల్వే స్టేషన్ వద్ద రైలు దిగి రోడ్డుపై ఏడుస్తున్న ఇద్దరు చిన్నారులను రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు చేరదీశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. శంషాబాద్‌లో గుడిసెలు వేసుకొని నివసిస్తున్న వారిలో చిన్నారులు కార్తీక్ (6), చిన్న (4) ఆడుకుంటూ పక్కనే ఉన్న రైల్వే స్టేషన్‌లో రైలెక్కి బుద్వేల్ స్టేషన్‌లో దిగారు. ట్రాఫిక్ కానిస్టేబుళ్లు వారిని గమనించారు. వివరాలు సేకరించి తల్లిదండ్రులకు అప్పగించారు.

Similar News

News October 17, 2025

బంజారాహిల్స్: బంద్ ఫర్ జస్టిస్‌కు కవిత మద్దతు

image

‘బంద్ ఫర్ జస్టిస్’కు మద్దతునివ్వాలని కోరుతూ ‘తెలంగాణ బీసీ జేఏసీ’ ఛైర్మన్ ఆర్.కృష్ణయ్య తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకి లేఖ రాశారు. బంద్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు కవిత ప్రకటించారు. బీసీల రిజర్వేషన్ల పెంపుపై మాట్లాడేందుకు కాంగ్రెస్, బీజేపీకి అర్హత లేదన్నారు. రెండు జాతీయ పార్టీలు బీసీలను వంచిస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం పంపిన బిల్లులను బీజేపీ కావాలనే పెండింగ్‌లో పెడుతోందన్నారు.

News October 17, 2025

BREAKING: ఘట్‌‌కేసర్ రైల్వే స్టేషన్‌లో హాష్ ఆయిల్‌తో పట్టుబడ్డ బాలుడు

image

ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్‌లో హాష్ ఆయిల్ తీసుకెళుతున్న బాలుడిని మల్కాజిగిరి SOT, ఘట్‌కేసర్ పోలీసులు సంయుక్తంగా ఈరోజు పట్టుకున్నారు. దేబేంద్ర జోడియా శ్రీను అనే వ్యక్తి ఒడిశా నుంచి HYDకు రూ.1.15 కోట్ల విలువైన 5.1 కిలోల హాష్ ఆయిల్‌ను బాలుడితో పంపిస్తున్నట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైంది. బాలుడిని జువైనల్ హోమ్‌కు తరలించామని, పరారీలో ఉన్న దేబేంద్ర కోసం గాలిస్తున్నామని రాచకొండ సీపీ సుధీర్‌బాబు తెలిపారు.

News October 17, 2025

HYD: రేపు బంద్.. మరి వైన్స్ టెండర్లు..?

image

రేపు బీసీ సంఘాలు తెలంగాణ బంద్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వైన్స్ టెండర్లకు ఎటువంటి అడ్డంకి ఉండదని, సెంటర్లు యథావిధిగా కొనసాగుతాయని DPEO ఉజ్వల రెడ్డి ఈరోజు HYDలో తెలిపారు. రేపటితో వైన్స్ టెండర్ల ప్రక్రియ ముగియనున్నట్లు చెప్పారు. రేపు సా.5 గంటల్లోపు సెంటర్‌లో ఉన్న వారి అప్లికేషన్లు మాత్రమే స్వీకరిస్తామని తెలిపారు. రేపు చివరి రోజు కావడంతో ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందన్నారు.