News January 31, 2025
HYD: ఆత్మహత్యలకు కాంగ్రెస్ అసమర్థతే కారణం: హరీశ్రావు

రాష్ట్రంలో జరుగుతున్న ఆత్మహత్యలన్నింటికీ ప్రత్యక్షంగా, పరోక్షంగా కాంగ్రెస్ అసమర్థ అనాలోచిత నిర్ణయాలే కారణమని మాజీ మంత్రి, MLA హరీశ్రావు విమర్శించారు. నాడు BRS హయాంలో నిర్మాణ రంగానికి స్వర్గధామంగా HYD ఉండేదన్నారు. అలాంటిది మేడ్చల్ గుండ్లపోచంపల్లిలో బిల్డర్ వేణుగోపాల్ రెడ్డి ప్లాట్లు అమ్ముడు పోలేదని ఉరేసుకునే పరిస్థితి రావడం శోచనీయన్నారు. రియల్ ఎస్టేట్ ఇప్పుడు బిల్డర్లకు నరకకూపం అయ్యిందన్నారు.
Similar News
News September 19, 2025
సంగారెడ్డి: ‘31,111 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా’

జిల్లాలో ఇప్పటివరకు 31,111 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్ గురువారం తెలిపారు. జిల్లాలో 514 మెట్రిక్ టన్నుల యూరియా డీలర్ల వద్ద అందుబాటులో ఉందని చెప్పారు. 6912 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు ఇంకా రావాల్సి ఉందని పేర్కొన్నారు. చివరి వారం వరకు యూరియా సరఫరా అవుతుందని తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
News September 19, 2025
రాబోయే 4 రోజులు వర్షాలు

APలోని దక్షిణ కోస్తా, రాయలసీమలో రాబోయే 4 రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని APSDMA తెలిపింది. నేడు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు-భారీ వర్షాలు, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, NTR, GNT, పల్నాడు, నంద్యాల, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్సుందని తెలిపింది. TGలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది.
News September 19, 2025
నేడు YCP ‘చలో మెడికల్ కాలేజీ’ కార్యక్రమం

AP: మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇవాళ ‘చలో మెడికల్ కాలేజీ’ చేపడుతున్నట్లు YCP ప్రకటించింది. పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో శాంతియుతంగా ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపింది. పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది.