News March 16, 2026

HYD: ఆదివారం.. నెత్తురోడిన నగరం

image

నగరంలో వీకెండ్‌ రక్తపాతం జరిగింది. వరుస ప్రమాదాలు, దారుణ ఘటనలు కలకలం రేపాయి. మేడిపల్లిలో కారు ఢీకొనడంతో దంపతులు దుర్మరణం పాలయ్యారు. ఒక్కగానొక్క కొడుకు అనాథయ్యాడు. ఉప్పల్‌లో కానిస్టేబుల్ సుధీర్‌ను దారుణంగా కత్తులతో హత్య చేశారు. శంషాబాద్‌లో వాహనం ఢీకొని విజయ్ (32) మృతి చెందాడు. గచ్చిబౌలిలో కర్ణాటక RTC బస్సు ఢీకొనడంతో బాలమ్మ (68) ప్రాణాలు కోల్పోయింది. ఒకే రోజు ఇన్ని దారుణాలు జరిగాయి.

Similar News

News April 14, 2026

HYD: ఉదయం నుంచి రాత్రి వరకు ఆంక్షలు

image

నగరంలో నేడు డా.బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు కీలక ఆంక్షలు విధించారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సెక్రటేరియట్, లిబర్టీ, బషీర్‌బాగ్, ట్యాంక్ బండ్ పరిసరాల్లో డైవర్షన్లు ఉంటాయి. 113, 6, 7Z, 8ల వంటి ఆర్‌టీసీ బస్సుల మార్గాలను కూడా మార్చారు. ప్రయాణికులు అంబేడ్కర్ జంక్షన్, నెక్లెస్ రోటరీ వంటి రద్దీ ప్రాంతాలను నివారించి, ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని
పోలీసులు సూచించారు.

అమీన్‌పూర్‌లో కూల్చివేతలు.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

image

అమీన్‌పూర్ పరిధిలోని ఐలాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కూల్చివేతలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కూల్చివేతలు చేయొద్దని ఆదేశించింది. నోటీస్ ఇవ్వకుండా కూల్చివేతలు చేయడం ఏంటని, హైడ్రా విధివిధానాలు ఏంటో చెప్పాలని పేర్కొంది. ఇక చెరువులు, పార్కులు, రోడ్లు ఆక్రమిస్తే కూల్చివేయచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.