News December 12, 2024
HYD: ఆన్లైన్ గేమింగ్.. బీ కేర్ ఫుల్!

ఆన్లైన్ గేమింగ్ ప్రమాదకరమని HYD సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. తాజాగా ‘X’లో పోస్ట్ చేశారు.
‘ఆన్లైన్ గేమింగ్ యాప్స్ ద్వారా మాల్వేర్తో డేటాచోరీ అవుతుంది. గేమింగ్ పేరిట బ్యాంక్ అకౌంట్ల వివరాలు సేకరిస్తారు. మీకు తెలియకుండానే అకౌంట్ నుంచి డబ్బు విత్ డ్రా అవుతుంది. APK ఫైల్స్, థర్డ్ పార్టీ యాప్స్ ఇన్స్టాల్ చేయొద్దు.’ అని పోలీసులు సూచించారు.
SHARE IT
Similar News
News October 28, 2025
జూబ్లీ బైపోల్: ఇంటి వద్దే వారికి ఓటు హక్కు

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో దివ్యాంగులు, వృద్ధులకు ఎన్నికల కమిషన్ ఇంటి వద్దే ఓటు వేసే అవకాశం కల్పించింది. ఇందుకు ఓటర్లు ముందుగా తమ పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు 102 మంది వృద్ధులు, దివ్యాంగులు దీనికోసం అప్లై చేసుకున్నారు. పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసేందుకు ఇబ్బందులు ఎదురుకాకుండా ఈసీ ఈ చర్యలు చేపట్టింది.
News October 28, 2025
HYD: హరీశ్‌రావు ఇంటికి KTR.. కార్యక్రమాలు రద్దు

హరీశ్‌రావు తండ్రి మరణించిన నేపథ్యంలో కేటీఆర్ ఆయన ఇంటికి బయలుదేరారు. పితృవియోగం కారణంగా ఈ రోజు జరగాల్సిన పార్టీ కార్యక్రమాలు, జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచార కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. కోకాపేటలోని హరీశ్‌రావు ఇంటి వద్దకు పెద్ద సంఖ్యలో ఆ పార్టీ నేతలు చేరుకున్నారు.
News October 28, 2025
HYD: జూబ్లీ బరిలో 29 మంది స్వతంత్రులు

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. గుర్తింపు పొందిన పొలిటికల్ పార్టీల నుంచి 26 మంది అభ్యర్థులు బరిలో దిగగా.. 29 మంది స్వతంత్రులు పోటీలో ఉన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఇప్పటికే అభ్యర్థులకు గుర్తులు కేటాయించగా.. నియోజకవర్గంలో మొత్తం 4,01,365 ఓటర్లు ఉన్నారు.


