News December 12, 2024

HYD: ఆన్‌లైన్‌ గేమింగ్.. బీ కేర్‌ ఫుల్!

image

ఆన్‌లైన్‌ గేమింగ్ ప్రమాదకరమని‌ HYD సైబర్ క్రైమ్‌ పోలీసులు హెచ్చరిస్తున్నారు. తాజాగా ‘X’లో పోస్ట్‌ చేశారు.
‘ఆన్‌లైన్‌ గేమింగ్ యాప్స్‌ ద్వారా మాల్‌వేర్‌తో డేటాచోరీ అవుతుంది. గేమింగ్ పేరిట బ్యాంక్‌ అకౌంట్ల వివరాలు సేకరిస్తారు. మీకు తెలియకుండానే అకౌంట్‌ నుంచి డబ్బు విత్‌ డ్రా అవుతుంది. APK ఫైల్స్, థర్డ్ పార్టీ యాప్స్ ఇన్‌స్టాల్ చేయొద్దు.’ అని పోలీసులు సూచించారు.
SHARE IT

Similar News

News December 28, 2024

VKB: జిల్లాలో నేటి ముఖ్యంశాలు!!

image

✔మన్మోహన్ సింగ్‌కు నివాళులర్పించిన సీఎం, జిల్లా నేతలు✔పూడూరు: రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని వ్యక్తి మృతి✔GREAT: రగ్బీ రాష్ట్ర జట్టుకు కోస్గి విద్యార్థి✔VKD:మహిళ మెడలోంచి బంగారం చోరీ✔VKB:మన్మోహన్‌సింగ్‌కు సర్వశిక్షా ఉద్యోగల నివాళి✔VKB:మాస్టర్ ప్లాన్ డ్రోన్ సర్వే REPORT విడుదల✔యాలాల్‌: జాతరకు వచ్చిన భక్తులపై కుక్కల దాడి✔ కొడంగల్:వానరానికి ఘనంగా అంత్యక్రియలు

News December 27, 2024

HYD: మంద జగన్నాథానికి మంత్రి పరామర్శ

image

నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నాగర్‌కర్నూల్ మాజీ ఎంపీ మంద జగన్నాథాన్ని HYD ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించారు. ఈ సందర్భంగా నిమ్స్ ఆసుపత్రి సూపరింటెండెంట్ బీరప్ప, వైద్యులతో ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయనకు మెరుగైన చికిత్సను అందించాలని మంత్రి వైద్యులను కోరారు.

News December 27, 2024

HYD: వారం రోజులు సంతాప దినాలు: TPCC

image

మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతితో వారం రోజులపాటు సంతాప దినాలుగా పాటించనున్నట్లు పేర్కొన్నారు. రేపటి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలతో పాటు జనవరి 3 వరకు అన్ని రాజకీయ కార్యక్రమాలు రద్దు చేయనున్నట్లు తెలిపారు.