News August 24, 2024
HYD: ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేసే CHANCE
HYD, RR, MDCL, VKB జిల్లాల్లోని ప్రజలు tspolice.gov.in వెబ్‌సైట్ ద్వారా పోలీసులకు ఫిర్యాదులు, సూచనలను ఇప్పుడు ఆన్‌లైన్ ద్వారా చేయొచ్చని HYD, CYB పోలీస్ అధికారులు తెలిపారు. FIR సైతం డైరెక్ట్ వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు ఉందన్నారు. ప్రజా భద్రత విషయంలో పారదర్శకతను పాటిస్తున్నట్లుగా పోలీసు యంత్రాంగం తెలిపింది.
Similar News
News September 8, 2024
ఘట్‌కేసర్: రైలు కింద పడి కానిస్టేబుల్ సూసైడ్
రైలు కింద పడి కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. సికింద్రాబాద్ పరిధిలోని గోపాలపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న నరసింహరాజు ఘట్‌కేసర్ వద్ద రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నరసింహరాజుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
News September 8, 2024
HYD: నయా మోసం.. నమ్మితే నట్టేట మునిగినట్టే!
HYDలో కేటుగాళ్లు నయా మోసాలకు పాల్పడుతున్నారు. టెన్త్ చదివితే చాలు FAKE ఐడీ, ఆధార్ కార్డులు, జాబ్ ఆఫర్ లెటర్లు, ఫేక్ డిగ్రీ, B.Tech మెమోలు, క్వాలిఫికేషన్ సర్టిఫికెట్లు తయారుచేసి అవే ఒరిజినల్ అని నమ్మిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో జాబ్ వచ్చేలా చేస్తామని రూ.లక్షలు కాజేస్తున్నారు. ప్రతి విషయంపై అప్రమత్తంగా ఉండాలని, ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలని రాచకొండ CP సుధీర్ బాబు సూచించారు.
News September 8, 2024
HYD: అలా చేస్తే.. ఏడు జిల్లాల్లో ఆక్రమణలకు చెక్!
HYD నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతల పై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏ మాత్రం తగ్గటం లేదు. దీంతో HMDA పరిధిలోని 7 జిల్లాల్లో చెరువుల పరిరక్షణ కోసం లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఛైర్మన్ బాధ్యతలను సైతం హైడ్రాకు అప్పగించడంపై ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇదే కాని జరిగితే.. HYD, సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్, గజ్వేల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో చెరువుల ఆక్రమణలకు చెక్ పడనుంది.