News August 10, 2024

HYD: ఆశలన్నీ.. ఆగస్టు నెల పైనే..!

image

HYD, RR, MDCL, VKB ప్రాంతాల ప్రజలు ఆగస్టు నెల పైన ఆశలు పెట్టుకున్నారు. జూన్, జులై నెలల్లో పెద్దగా భూగర్భ జలమట్టాలు పెరగలేదు. 250 ప్రాంతాల్లో అధికారులు నిర్వహించిన ఫీజోమీటర్ తనిఖీల్లో HYD జిల్లాలో మేలో 9.42 మీటర్ల లోతుకు పడిపోతే, జూన్లో 8.56 మీటర్లకు మాత్రమే పెరిగింది. మరోవైపు రంగారెడ్డిలో మే నెలలో 14.06 నుంచి జూన్లో 13.99, మేడ్చల్ జిల్లాలో 13.99 నుంచి 12.89 మీటర్లకు స్వల్పంగా పెరిగాయి.

Similar News

News January 20, 2025

HYD: AIR PORT రన్ వే కింద నుంచి ఎలివేటెడ్ కారిడార్!

image

ఎయిర్‌పోర్ట్ అథారిటీ పరిమితుల కారణంగా HMDA డబుల్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాన్ని బేగంపేట అంతర్జాతీయ విమానాశ్రయ రన్ వే కింద నుంచి అండర్ గ్రౌండ్‌లో తాడ్ బండ్, బోయిన్‌పల్లి మధ్యలో దాదాపు 600 మీటర్ల మేర నిర్మించాలని నిర్ణయం తీసుకుందని హైదరాబాద్ మెట్రో ఎండీ NVS రెడ్డి తెలియజేశారు. కంటోన్మెంట్ ఏరియాలో విస్తృతంగా పర్యటించి, మార్గాలను పరిశీలించారు.

News January 20, 2025

GHMC ఆఫీస్‌లో ప్రజావాణి కార్యక్రమం

image

ఖైరతాబాద్‌లోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజావాణి కార్యక్రమానికి డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి ఫిర్యాదులను, వినతులను స్వీకరించారు. వెంటనే సంబంధిత అధికారులకు పరిష్కరించాలని ఆదేశించారు. సకాలంలో సమస్యలకు పరిష్కారం చూపాలని అధికారులను డిప్యూటీ మేయర్ ఆదేశించారు.

News January 20, 2025

చర్లపల్లి: మరో 8 రైళ్లు నడిపేందుకు నిర్ణయం

image

సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లలో పెరిగిన రైళ్ల ఒత్తిడిని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి స్టేషన్ విస్తరణ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి టెర్మినల్ నుంచి మార్చిలో మరో 8 రైళ్లను నడిపేందుకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే చర్లపల్లి టర్మినల్ నుంచి చెన్నై, గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపడానికి పచ్చ జెండా ఊపింది.