News June 23, 2024
HYD: ఆషాఢం బోనాల ఉత్సవాలకు రూ.20 కోట్లు మంజూరు

ఆషాఢ బోనాల ఉత్సవాల కోసం సీఎం రేవంత్ రెడ్డి రూ.20 కోట్లు మంజూరు చేశారని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ HYDలో వెల్లడించారు. తెలంగాణ సాంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ ఉత్సవాలు నిర్వహించాలని దేవాదాయ శాఖ అధికారులకు మంత్రి ఆదేశాలు ఇచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దేవాదాయ శాఖ కమిషనర్లతో సచివాలయంలో మంత్రి సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించాలన్నారు.
Similar News
News October 14, 2025
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. మహిళల ఓట్లే కీలకం..!

HYD జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పురుషుల ఓట్లు వివిధ పార్టీలకు డివైడ్ అయ్యే అవకాశం ఉన్నా మహిళల ఓట్లు మాత్రం ఒకే పార్టీకి గంప గుత్తగా పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తం 3,98,982ఓటర్లు ఉండగా అందులో 1,91,590మంది మహిళా ఓటర్లే ఉన్నారు. కాగా ఫ్రీబస్సు స్కీమ్‌తో మహిళలు తమకే ఓట్లు వేస్తారని కాంగ్రెస్ నేతలు అంటుండగా గతంలో బతుకమ్మ చీరలిచ్చిన KCRవైపే మహిళలు ఉన్నారని BRSనేతలు చెబుతున్నారు.
News October 14, 2025
బల్కంపేట ఎల్లమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు

HYD బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో మంగళవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వేకువజామునే ఆలయ అధికారులు, అర్చకులు, వేద పండితులు అమ్మవారి మూలమూర్తికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం వివిధ పుష్పాలు, పట్టు చీరతో అలంకరించి, పంచ హారతులు, కుంకుమార్చన వంటి ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.
News October 14, 2025
HYD: BRS సభలో కన్నీరు పెట్టుకున్న మాగంటి సునీత

HYD జూబ్లీహిల్స్ రహమత్‌నగర్‌లో బీఆర్ఎస్ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. సభలో ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత కన్నీటి పర్యంతమయ్యారు. తన భర్త, దివంగత మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ను గుర్తుతెచ్చుకొని కన్నీరు పెట్టుకున్నారు. పక్కనే ఉన్న కుటుంబ సభ్యులు ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తదితరులు ఆమెకు ధైర్యం చెప్పారు. హరీశ్‌రావు సైతం ఉద్వేగానికి లోనయ్యారు.