News July 28, 2024

HYD: ఆషాఢ బోనాలు.. సీపీ కీలక ఆదేశాలు

image

బోనాల పండుగ సందర్భంగా పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను రాచకొండ CP సుధీర్ బాబు ఆదేశించారు. కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సున్నితమైన ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. సమర్థవంతమైన సిబ్బందిని బందోబస్తులో ఉంచాలని సూచించారు. పాత నేరస్తులపై నిఘా ఉంచాలని, నేరాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Similar News

News October 11, 2024

HYD: CM రేవంత్ రెడ్డి అత్యుత్సాహం తగ్గించుకోవాలి: చెన్నయ్య

image

ఎస్సీలలో ఎక్కువగా లబ్ది పొందింది మాదిగ కులస్తులేనని, తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అవసరం లేదని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఛైర్మన్ జి.చెన్నయ్య స్పష్టం చేశారు. బషీర్‌బాగ్ సమావేశంలో పోరాట సమితి ఛైర్మన్లు వెంకటేశ్వర్లు, బేల బాలకిషన్, గోపోజు రమేశ్, బత్తుల రాంప్రసాద్‌తో కలిసి చెన్నయ్య మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యుత్సాహం తగ్గించుకోవాలన్నారు.

News October 11, 2024

HYDలో రేపు డబుల్ ధమాకా

image

హైదరాబాద్‌లో ఈ దసరాకు తగ్గేదే లేదు. విందుకు వినోదం జతకానుంది. రేపు దసరాతో పాటు ఉప్పల్ వేదికగా ఇండియా VS బంగ్లాదేశ్‌ T-20 మ్యాచ్ జరగనుంది. నగరం అంతటా ఇక సందడే సందడి. ఉదయం నుంచే ఆలయాలు, అమ్మవారి మండపాలు కిక్కిరిసిపోతాయి. మధ్యాహ్నం బలగం అంతా కలిసి విందులో పాల్గొంటారు. సాయంత్రం వరకు హైదరాబాద్ అంతటా దసరా వైభోగమే. దీనికితోడు‌ రాత్రి మ్యాచ్‌ ఉండడంతో క్రికెట్ ప్రియులు డబుల్ ధమాకా అంటున్నారు.

News October 11, 2024

సొంతూళ్లకు ప్రయాణం.. హైదరాబాద్‌ ఖాళీ!

image

హైదరాబాద్‌ ఖాళీ అవుతోంది. దసరా సెలవులకు ప్రజలు సొంతూళ్ల బాట పట్టారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌తో పాటు MGBS, JBS, ఉప్పల్ రింగ్‌ రోడ్‌ వద్ద బస్టాపుల్లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. సొంత వాహనాల్లోనూ బయల్దేరడంతో సిటీ శివారుల్లోని టోల్‌గేట్ల వద్ద కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పంతంగి, బీబీనగర్‌, దుద్దెడ టోల్‌గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇదిలా ఉంటే నగరంలో ట్రాఫిక్ కాస్త తగ్గింది.