News July 16, 2024
HYD: ఆసుపత్రులకు పోటెత్తారు.. జర జాగ్రత్త..!

HYD, RR, MDCL, VKB జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో డెంగ్యూ, డిఫ్తీరియా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. బాధితుల్లో ఎక్కువ శాతం చిన్నారులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. నిలోఫర్‌లో 2 రోజుల్లో ఏడుగురు, గాంధీలో నలుగురు చిన్నారులు డెంగ్యూతో చేరారు. నల్లకుంట ఫీవర్ హాస్పిటల్‌తో పాటు ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ రోగుల రద్దీ ఎక్కువైంది. కాచి చల్లారిన నీటిని తాగాలని, వేడి ఆహారం తినాలని వైద్యులు చెబుతున్నారు.
Similar News
News July 11, 2025
JNTUHలో డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్

జేఎన్టీయూ హైదరాబాద్ & జర్మనీలో టాప్-3లో ఉన్న Reutlingen పబ్లిక్ యునివర్సిటీ కలసి సంయుక్తంగా అందిస్తున్న 3 ఇంటర్నేషనల్ డిగ్రీ కోర్సులలో అడ్మిషన్లు మొదలయ్యాయి. జేఈఈ, టీజీఎంసెట్, గేట్ & టీజీపీజీసెట్ రాసిన విద్యార్థులు www.jntuh.ac.in ద్వారా అప్లై చేసుకోవచ్చు. కోర్సులో ఎంపికైన విద్యార్థులకు స్కాలర్షిప్ ఉంటుంది. వారానికి 20 గంటల పనికి పర్మిషన్, 18 నెలల వర్క్ పర్మిట్ కూడా లభిస్తుంది.
News July 11, 2025
HYD: పీ.వీ.రమణ పురస్కారానికి దరఖాస్తుల ఆహ్వానం

సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో రంగస్థల కళలశాఖ ప్రతి సంవత్సరం ‘పీ.వీ.రమణ రంగస్థల స్మారక పురస్కారం’ ప్రదానం చేయనున్నారు. 2024-25 సంవత్సరానికిగాను దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు యూనివర్సిటీ ఓ సర్కులర్ విడుదల చేసింది. ఆగస్టు 1లోగా రంగస్థలంలో కృషి చేసిన నటులు, సాంకేతిక నిపుణులు అర్హులైన వారు తెలుగు విశ్వవిద్యాలయం బాచుపల్లి ప్రాంగణంలో తమ బయోడేటాతో దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు.
News July 11, 2025
HYD: చైల్డ్ పోర్న్ వీడియోలపై 22కేసులు నమోదు

HYD సైబర్ క్రైమ్ పోలీసులు వివిధ కేసుల్లో మొత్తం 25 మందిని అరెస్టు చేసి రూ.3.67కోట్లను బాధితులకు రిఫండ్ చేశారు. పట్టుబడిన నేరగాళ్లపై దేశవ్యాప్తంగా 453 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని వాటి సంఖ్య 66గా ఉంది. ఈ క్రమంలో చైల్డ్ పోర్న్ వీడియోల కేసుల్లోనూ సైబర్ క్రైమ్ పోలీసులు 22 కేసులు నమోదు చేశారు.