News March 31, 2025
HYD: ఆస్తి పన్ను వసూళ్లలో జీహెచ్ఎంసీ రికార్డు

ఆస్తి పన్ను వసూళ్లలో జీహెచ్ఎంసీ రికార్డు సాధించింది. గ్రేటర్ పరిధిలో పన్ను వసూళ్లు నేటితో రూ.2 వేల కోట్లు దాటిపోయాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2012.36 కోట్లు వసూలైనట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. జీహెచ్ఎంసీ చరిత్రలోనే తొలిసారిగా ఆస్తిపన్ను వసూళ్లు రూ.2వేల కోట్లు దాటినట్లు అధికారులు పేర్కొన్నారు.
Similar News
News April 4, 2025
టంగుటూరులో కారు ఢీకొని ఒకరి మృతి

టంగుటూరు టోల్ ప్లాజా సమీపంలో కారు ఢీ కొట్టడంతో గుర్తు తెలియని వ్యక్తి గురువారం రాత్రి మృతి చెందాడు. సుమారు 40 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తిని కారు ఢీ కొనటంతో అతని తలకు బలమైన గాయాలై చనిపోయాడు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను పెట్రోలింగ్ పోలీసులు టంగుటూరు ఎస్సైకు సమాచారం అందించారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.
News April 4, 2025
వక్ఫ్ బిల్లు ఆమోదం పొందడం చరిత్రాత్మకం: కిషన్‌రెడ్డి

వక్ఫ్ సవరణ(UMEED) బిల్లు లోక్‌సభ, రాజ్యసభలో ఆమోదం పొందడం చరిత్రాత్మకమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. వక్ఫ్ సంస్థల్లో మెరుగైన గవర్నెన్స్, పారదర్శకత, అవినీతి నిర్మూలనకు ఈ బిల్లు ఉపకరిస్తుందని ఉద్ఘాటించారు. ముస్లిం మహిళలకు, ఆ కమ్యూనిటీలోని పస్మాందాస్, అఘాఖానీస్‌కు లబ్ధి చేకూరుస్తుందని పేర్కొన్నారు. పీఎం మోదీ, కేంద్రమంత్రి కిరణ్ రిజిజుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
News April 4, 2025
కొత్తవలస: హత్యకేసులో నిందితుడికి జీవిత ఖైదు

కొత్తవలస పోలీస్ స్టేషన్‌లో 2022లో నమోదైన హత్య కేసులో నిందితుడు అప్పన్నదొర పాలెం పంచాయతీ జోడుమెరక గ్రామానికి చెందిన జోడి నూకరాజుకు జీవిత ఖైదు, రూ.1000 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చిందని ఎస్పీ వకుల్ జిందాల్ గురువారం తెలిపారు. నిందితుడు తన భార్యను పెట్రోల్ పోసి నిప్పంటించి చంపాడన్నారు. తిరిగి భార్య కనిపించలేదని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కోర్టులో నేరం రుజువు కావడంతో శిక్ష ఖరారైందన్నారు.