News July 17, 2024
HYD: ఆస్పత్రిలో ఎల్బీనగర్ MLAకు చికిత్స.. KTR పరామర్శ

ఎల్బీనగర్ MLA దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గత 3 రోజుల నుంచి తీవ్ర జ్వరంతో HYDలోని AIG హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR బుధవారం ఆస్పత్రికి చేరుకొని MLAను పరామర్శించారు. ఆయన ఆరోగ్య స్థితిగతులపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. MLA కౌశిక్ రెడ్డి, BRS లీడర్ జాన్సన్, సుధీర్ రెడ్డి సతీమణి కమలారెడ్డి ఉన్నారు.
Similar News
News July 11, 2025
HYD: కల్తీ కల్లు తాగి ఎనిమిది మంది మృతి

కల్తీ కల్లు <<17017648>>రాజేసిన అగ్గి<<>> ఇంకా చల్లారడంలేదు. ఈ ప్రమాదపు కల్లు తాగి అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ పెద్ద గంగారాం (70) అర్ధరాత్రి 1:30కు గాంధీ హాస్పిటల్‌లో మృతి చెందాడు. కూకట్‌పల్లి PS పరిధిలోని ఆదర్శనగర్‌లో ఆయన నివాసం ఉండేవారు. ఈయన మరణంతో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. 30 మందికి పైగా వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొంతుతున్నారు.
News July 11, 2025
HYD: IITHలో మినీ డ్రోన్ కాంపిటీషన్

IITHలో మినీ డ్రోన్ కాంపిటీషన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మ్యాథ్ వర్క్ TiHAN పేరిట నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కాంపిటీషన్లో పాల్గొనడానికి జులై 31 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నట్లుగా వివరించారు. ఈ కాంపిటీషన్లో మూడు రౌండ్లు ఉంటాయన్నారు. కాంపిటీషన్ మెటీరియల్ సైతం అందించే అవకాశం ఉందన్నారు. వెబ్‌సైట్ spr.ly/60114abzL ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
News July 11, 2025
GHMCలో డిప్యూటీ కమిషనర్ల బదిలీలు

GHMCలో డిప్యూటీ కమిషనర్‌లు బదిలీ అయ్యారు. ఇటీవల పలువురు మున్సిపల్ కమిషనర్లు పదోన్నతులు పొందిన నేపథ్యంలో జీహెచ్ఎంసీలోనే పనిచేస్తున్న వారిని ఇతర సర్కిళ్లకు బదిలీ చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి పోస్టింగ్‌లు ఇచ్చారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 23 మంది ట్రాన్స్‌ఫర్, పోస్టింగ్‌లు పొందారు.