News January 26, 2025

HYD: ఆ ఆస్పత్రులపై చర్యలు తీసుకోండి: కలెక్టర్ అనుదీప్

image

అనుమతులు లేని ప్రైవేట్‌ ఆస్పత్రులు, క్లినిక్‌లు, ఫిజియోథెరపీ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి వైద్యాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లాస్థాయి క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌ సమావేశాన్ని ఆయన నిర్వహించారు. ప్రైవేట్‌ క్లినిక్‌లు, ఆస్పత్రులను నడిపించే వ్యక్తులు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి ఆఫీస్‌లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు.

Similar News

News October 23, 2025

హైదరాబాద్‌లో చలి షురైంది!

image

HYD నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో చలి మొదలైంది. కార్తీక మాసం ప్రారంభం కావడంతో చలి నెమ్మదిగా పెరుగుతోంది. చల్లటి గాలులు వీస్తున్నాయి. పగటి కాలం సంకుచితమై, సాయంత్రం 6 గంటలకు సూర్యాస్తమయం జరుగుతోంది. ప్రజలు చలి నుంచి రక్షణకు స్వెటర్లు, రగ్గులను సిద్ధం చేసుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో జనాలు ఇప్పటికే చలి నివారణ కోసం మంటలను వెలిగించి కాపుకుంటున్నారు. మరి మీ ఏరియాలో చలి ఎలా ఉంది?

News October 22, 2025

BIG BREAKING: పోచారంలో కాల్పుల కలకలం

image

హైదరాబాద్ శివారులోని పోచారంలో కాల్పులు కలకలం రేపాయి. బీజేపీ నేతలు తెలిపిన వివరాలు.. బహదూర్‌పురాకు చెందిన ఇబ్రహీం నాగారం మున్సిపాలిటీకి పరిధి రాంపల్లికి చెందిన సోనూ సింగ్‌పై యమ్నంపేట కిట్టి స్టీల్ కంపెనీ వద్ద కాల్పులు జరిపాడు. సోనూ పరిస్థితి విషమించడంతో మేడిపల్లిలోని శ్రీకర హాస్పిటల్‌కు తరలించారు. కాల్పులకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News October 22, 2025

జూబ్లీహిల్స్‌లో నవీన్ యాదవ్, సునీత నామినేషన్లకు ఆమోదం

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక స్క్రూటినీ వేళ రిటర్నింగ్ ఆఫీస్ వద్ద కోలాహలం నెలకొంది. అభ్యర్థులు పోటీలో ఉంటారా? లేదా? అనే వెరిఫికేషన్ ఆసక్తిని పెంచింది. అభ్యర్థులు అయితే కాస్త టెన్షన్ పడ్డారు. సునీత నామినేషన్ రద్దు చేయాలని, నవీన్ యాదవ్ నామినేషన్ రద్దు చేయాలని SMలో ఇరు పార్టీల నేతలు పోస్టులు పెట్టారు. కానీ, పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన రిటర్నింగ్ అధికారులు నవీన్ యాదవ్, సునీత నామినేషన్లకు ఆమోదం తెలిపారు.