News February 14, 2025

HYD: ఆ పాలు తాగితే వారికి అనారోగ్యమే..!

image

చిక్కదనం కోసం మాల్టో డెక్స్‌ట్రిన్ కలిపిన పాలు తాగితే షుగర్ పేషెంట్లకు చక్కర స్థాయిలు పెరిగి, అనారోగ్యానికి తీస్తుందని ఫుడ్ సేఫ్టీ కమిషన్ అధికారులు తెలిపారు. అందుకే HYD నగరం సహా అన్ని ప్రాంతాల్లో పాలలో మాల్టో డెక్స్‌ట్రిన్ కలపటాన్ని నిషేధించినట్లుగా పేర్కొన్నారు. ఇందులో హై గ్లైసిమిక్ ఇండెక్స్ (GI) ఉంటుందని X వేదికగా ట్విట్ చేశారు. పాలపై అనుమానం వస్తే ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 28, 2025

ఆసిఫాబాద్: BSNL టవర్లకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి: కలెక్టర్

image

BSNL నెట్వర్క్ టవర్ల నిర్మాణాల కొరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శుక్రవారం ఆసిఫాబాద్ కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా అటవీశాఖ అధికారి నీరజ్ కుమార్, బిఎస్ఎన్ఎల్ నిజామాబాద్ సర్కిల్ జనరల్ మేనేజర్ వెంకటేశ్వర్లతో కలిసి నెట్వర్క్ టవర్ల నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మంజూరైన 9 టవర్లలో 8 టవర్ల నిర్మాణాలకు ఎలాంటి ఆటంకాలు లేనందున ప్రారంభించాలన్నారు.

News March 28, 2025

కుప్పకూలిన 1000 పడకల ఆసుపత్రి.. భారీగా క్షతగాత్రులు

image

భూకంప తీవ్రతకు మయన్మార్‌ రాజధాని నేపిడాలో 1,000 పడకల ఆసుపత్రి కుప్పకూలింది. ఇందులో పెద్ద ఎత్తున క్షతగాత్రులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మండలే నగరంలో ఒక వంతెన కూలిపోయింది. పలు చోట్ల ఎత్తైన భవనాలు, గుళ్లు నేలకొరిగాయి. ఇప్పటి వరకూ 55మంది మృతి చెందినట్లు అధికారులు తెలుపగా సంఖ్య మరింతగా పెరిగే అవకాశముంది. బ్యాంకాక్‌లో భారీ భవనం కూలడంతో ముగ్గురు మృతి చెందగా పదుల సంఖ్యలో శిథిలాల కింద చిక్కుకున్నారు.

News March 28, 2025

1న ఉదయం 7 గంటలకే సామాజిక పింఛన్లు పంపిణీ ప్రారంభం

image

జిల్లా పరిధిలో ఎన్టీఆర్ సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం మే 1న ఉదయం ఏడు గంటలకే ప్రారంభించనున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. జిల్లాలో 2,61,841 మంది లబ్ధిదారులు ఉండగా వారికి రూ.111.82 కోట్లు పంపిణీ చేయనున్నట్లు వివరించారు. సచివాలయ సిబ్బంది ఇంటింటికి వచ్చి లబ్ధిదారులకు నగదు అందజేస్తారన్నారు. ఆరోజు పింఛన్ పొందే ప్రతి ఒక్కరు ఇంటి వద్ద ఉండి నగదు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

error: Content is protected !!