News June 11, 2024

HYD: ఆ ప్రచారం నమ్మకండి: బల్మూరి వెంకట్ 

image

పదేళ్లు KCR గడీల పాలన సాగిందని, రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాతే గడీల పాలనకు స్వస్తి పలికామని MLC బల్మూరి వెంకట్ అన్నారు. ఈరోజు HYDలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రజా పాలన వచ్చిందన్నారు. పింక్ మీడియా అసత్యపు ప్రచారం చేస్తోందని, కొత్త యూట్యూబ్ ఛానల్స్ పెట్టి నెలకు రూ.3 లక్షలు ఇస్తున్నారన్నారు. TSకు బదులు TGగా మార్చినందుకు రూ.4 వేల కోట్లు ఖర్చు అవుతాయనేది అబద్ధమన్నారు.  

Similar News

News December 1, 2025

HYD: కరెంటు బిల్లే క్రెడిట్ స్కోరు.!

image

‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’లో ప్రభుత్వం కీలక ఆర్థిక సంస్కరణను ప్రకటించనుంది. ‘రుణ చరిత్ర లేని’ ప్రజల కోసం తెలంగాణ ఇన్ఫర్మేషన్ బ్యూరో (TIB) ఏర్పాటు కానుంది. ఈ సంస్థ కరెంటు బిల్లులు, ఇంటి పన్నులు వంటి చెల్లింపుల రికార్డులను పరిశీలించి ‘ఆల్టర్నేటివ్ క్రెడిట్ స్కోరు’ను ఇస్తుంది. ఈ స్కోరు ఆధారంగా బ్యాంకులు లక్షలాది మందికి రుణాలు అందించే అవకాశం ఉందని అధికారులు Way2Newsకు తెలిపారు.

News December 1, 2025

HYD: విమానంలో మహిళా సిబ్బందికి లైంగిక వేధింపులు

image

దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో మహిళా క్యాబిన్ సిబ్బందిని ఓ ప్రయాణికుడు లైంగికంగా వేధించాడు. విమానం హైదరాబాద్ చేరుకోగానే RGIA పోలీసులు కేరళకు చెందిన ఆ ప్రయాణికుడిని అరెస్ట్ చేశారు. యువతి ఫిర్యాదు మేరకు, లైంగిక వేధింపులు, దాడికి సంబంధించిన BNS సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News December 1, 2025

HYD: ‘ఓన్లీ ప్రాఫిట్‌ నో లాస్’ పేరుతో రూ.1.87కోట్ల మోసం

image

స్టాక్‌ సలహాల పేరుతో నగరానికి చెందిన కృత్రిమ ఆభరణాల వ్యాపారిని మోసగించిన ఇండోర్‌కు చెందిన ముఖేశ్ పాఠక్‌పై సీసీఎస్‌ కేసు నమోదు చేసింది. ‘ఓన్లీ ప్రాఫిట్ నో లాస్’ అని నమ్మబలికి 2021 నుంచి 2024 వరకు దశలవారీగా రూ.1.87కోట్లు తీసుకున్న నిందితుడు. చివరికి ఇచ్చిన చెక్ కూడా బౌన్స్ కావడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సీసీఎస్‌ తెలిపింది.