News February 19, 2025
HYD: ఆ ఫ్లాట్లు కొని ఇబ్బంది పడొద్దు!

అనుమతి లేని లే అవుట్లలో ప్లాట్లు కొని ఇబ్బందులు పడొద్దని హైడ్రా సూచించింది. HYD శివార్లలో ఫార్మ్ ప్లాట్ల పేరిట అమ్మకాలు జరుగుతున్నాయని, వీటిని కొన్నవారు తర్వాత ఇబ్బందులు పడాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఫార్మ్ ల్యాండ్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై నిషేదం ఉన్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో అమ్మకాలు జరుగుతున్నాయని హైడ్రాకు వచ్చిన ఫిర్యాదుల మేరకు తెలుస్తోందని కమిషనర్ రంగనాథ అన్నారు.
Similar News
News January 2, 2026
మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణకు సూచనలు(2/2)

మొక్కజొన్న పంట 31 నుంచి 60 రోజుల లోపు ఉండి పైరులో 6-10% మొక్కలను కత్తెర పురుగు రెండో దశ లార్వా ఆశించినట్లు గమనిస్తే రసాయన మందులతో సస్యరక్షణ చేపట్టాలి. లీటరు నీటికి 0.4 గ్రాముల ఇమామెక్టిన్ బెంజోయేట్ 5% SG లేదా స్పైనోశాడ్ 45% SC 0.3ml కలిపి.. చేతి పంపుతో మొక్క సుడులలో పడే విధంగా పిచికారీ చేసి కత్తెర పురుగును నియంత్రించవచ్చు. ఈ రసాయనాల పిచికారీ విషయంలో వ్యవసాయ నిపుణుల సలహా తప్పక తీసుకోండి.
News January 2, 2026
ఆసిఫాబాద్: ఎస్పీ సీరియస్ అలర్ట్.!

ఆసిఫాబాద్ జిల్లాను కమ్మేస్తున్న దట్టమైన పొగమంచుపై పోలీస్ శాఖ స్పందించింది. రోడ్లపై మరణ మృదంగం మోగకుండా ఉండేందుకు ఎస్పీ నితిక పంత్ వాహనదారులను హెచ్చరించారు. వేగం తగ్గించడమే కాదు, తప్పక లైట్లు ఆన్ చేయాలన్నారు. “కనిపించని దారి – మితిమీరిన వేగం” ప్రాణాల మీదకు తెస్తుందన్నారు. భారీ వాహనదారులు రోడ్డు పక్కన ఆపేటప్పుడు ఇండికేటర్లు వాడాలని, అవసరం లేని ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని ప్రజలకు చెప్పారు.
News January 2, 2026
నేటి నుంచి కొత్త పాసు పుస్తకాల పంపిణీ

AP: నేటి నుంచి ఈ నెల 9 వరకు గ్రామసభల్లో కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో ప్రభుత్వ రాజముద్రతో రూపొందించిన పాస్ బుక్‌లను ప్రజాప్రతినిధులు అందించనున్నారు. వాటిలో ఏవైనా తప్పులుంటే యజమానులు ఆందోళన చెందవద్దని అధికారులు తెలిపారు. పాసు పుస్తకాన్ని స్వర్ణ వార్డు, గ్రామ రెవెన్యూ సిబ్బందికి ఇస్తే తప్పులు సవరించి కొత్త పాస్ పుస్తకాలు అందిస్తారని పేర్కొన్నారు.


