News May 21, 2024

HYD: ఆ హక్కు కాంగ్రెస్‌కు లేదు: కొండా విశ్వేశ్వర్ రెడ్డి 

image

రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌‌కు లేదని బీజేపీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. ఢిల్లీలో పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో సోమవారం కొండా మాట్లాడుతూ.. 31 శాతం దళితులే ఉన్న రాయ్‌బరేలి నియోజకర్గంలో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఆ వర్గానికి కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఇవ్వలేదన్నారు. దేశ రాజధాని ప్రజలంతా బీజేపీకే మరోసారి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

Similar News

News November 25, 2025

GHMCలోకి మున్సిపాల్టీలు, కార్పొరేషన్‌లు ఇవే!

image

☛మున్సిపాల్టీలు: పెద్దఅంబర్‌పేట్, జల్‌పల్లి, శంషాబాద్, తుర్కయంజాల్, మణికొండ, నార్సింగి, ఆదిభట్ల, తుక్కుగూడ, మేడ్చల్, నాగారం, దమ్మాయిగూడ, పోచారం, ఘట్కేసర్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, కొంపల్లి, దుండిగల్, IDAబొల్లారం,తెల్లాపూర్, అమీన్‌పూర్
☛కార్పొరేషన్‌లు: బండ్లగూడ జాగీర్, మీర్‌పేట్, బోడుప్పల్,నిజాంపేట్, పీర్జాదిగూడ, జవహర్‌నగర్, బడంగ్‌పేట్ విలీనమవుతాయి.
ఇబ్రహీంపట్నం, కొత్తూర్, అలియాబాద్ లిస్ట్‌లో లేవు

News November 25, 2025

రంగారెడ్డి జిల్లాలో వార్డుల కేటాయింపు ఇలా

image

రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న 526 గ్రామ పంచాయతీల పరిధిలో 4,668 వార్డులు ఉన్నాయి. వీటిలో 100% ST జనాభా ఉన్న పంచాయతీల్లో 238 వార్డులు మహిళలకు కేటాయించారు. మరో 238 వార్డులను పురుషులు, మహిళలకు కేటాయించారు. ఇక జనరల్ పంచాయతీలో ST మహిళలకు 106, పురుషులకు 153 స్థానాలు కేటాయించారు. ఎస్సీ మహిళలకు 378 వార్డులు కేటాయించగా.. 522 స్థానాలు మహిళలు, పురుషులకు కేటాయించారు.

News November 25, 2025

రంగారెడ్డి జిల్లా పంచాయతీ రిజర్వేషన్లు ఖరారు

image

గ్రామపంచాయతీల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఖరారు చేయగా.. డెడికేషన్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం బీసీ రిజర్వేషన్లు ఖరారు చేశారు. రంగారెడ్డి జిల్లాలో 526 పంచాయతీలు ఉండగా.. ST జనరల్‌కు 49, ST మహిళలకు 42, SC జనరల్ 55, SC మహిళలకు 51, BC జనరల్‌కు 50, మహిళలకు 42, అన్ రిజర్వ్‌డ్ కేటగిరిలో మహిళలకు 112, పురుషులకు 125 స్థానాలు కేటాయించారు.