News May 21, 2024
HYD: ఆ హక్కు కాంగ్రెస్‌కు లేదు: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదని బీజేపీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. ఢిల్లీలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో సోమవారం కొండా మాట్లాడుతూ.. 31 శాతం దళితులే ఉన్న రాయ్‌బరేలి నియోజకర్గంలో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఆ వర్గానికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదన్నారు. దేశ రాజధాని ప్రజలంతా బీజేపీకే మరోసారి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
Similar News
News November 24, 2025
26న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ప్రమాణం

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారానికి టైమ్ ఫిక్స్ అయింది. ఈ నెల 26న అసెంబ్లీలోని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తన ఛాంబర్లో నవీన్ యాదవ్‌తో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో సహా పలువురు కాంగ్రెస్ పెద్దలు హాజరుకానున్నారు. కాగా, ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో నవీన్ యాదవ్ 24,658 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే.
News November 24, 2025
HYDలో రూ.850 కోట్లు.. ఇందులో మీవీ ఉండొచ్చు!

1, 2 కాదు అక్షరాలా రూ.1,150 కోట్లు ఉన్నాయి తీసుకోండి అని వివిధ బ్యాంకుల అధికారులు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా ప్రజలను కోరుతున్నారు. రూ.850 కోట్ల అన్క్లెయిమ్డ్ అమౌంట్ ఈ 2 జిల్లాల్లోని బ్యాంకుల్లోనే ఉంది. హైదరాబాద్ జిల్లాలోని బ్యాంకుల్లో రూ.850 కోట్లు, రంగారెడ్డి జిల్లాలోని బ్యాంకులలో రూ.300 కోట్లు ఉన్నాయి. వచ్చేనెల 31లోపు ఖాతాదారులు, వారి నామినీలుగానీ ఈ మొత్తాన్ని డ్రా చేసుకోవచ్చు.
SHARE IT
News November 24, 2025
HYD: డిజిటల్ ప్రపంచంలో భద్రత తప్పనిసరి: సీపీ

హైదరాబాద్ సీపీ సజ్జనార్ ప్రజలకు కీలక సూచన చేశారు. ‘డిజిటల్ ప్రపంచంలో భద్రత తప్పనిసరి. మీ డేటా, మీ జీవితానికి కీలకం. దాన్ని మీరే కాపాడుకోవాలి. డేటా చోరీ జరిగితే, ఆలస్యం చేయకుండా వెంటనే జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1930కు కాల్ చేయండి. లేదా cybercrime.gov.inలో ఫిర్యాదు చేయండి’ అని Xలో ట్వీట్ చేశారు.


