News April 11, 2024
HYD: ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉందా..? కోర్సు మీకోసమే!

HYD ఉస్మానియా యూనివర్సిటీ CELTలో 8, 9, 10వ తరగతి, ఇంటర్ విద్యార్థులకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్స్ స్కిల్స్ అండ్ పర్సనల్ డెవలప్‌మెంట్ సర్టిఫికెట్ కోర్సును నెలరోజుల పాటు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆసక్తి గలవారు 79899 03001కు కాల్ చేసి ఏప్రిల్ 14 వరకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. 8, 9, 10వ తరగతి వాళ్లకి ఉ.8:15 నుంచి ఉ.9:45 వరకు, ఇంటర్ వాళ్లకి ఉ.6:30 నుంచి ఉ.8 వరకు తరగతులు ఉంటాయన్నారు.
Similar News
News March 16, 2025
సికింద్రాబాద్: అగ్నివీర్ దరఖాస్తులు.. కీలక సూచన

భారత సైన్యంలో సేవలందించేందుకు అగ్ని వీర్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఏప్రిల్ 10 ఆఖరు తేది. ఎంపిక ప్రక్రియకు సంబంధించి అభ్యర్థులకు చాలా అనుమానాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేసుకునేందుకు అభ్యర్థులు సికింద్రాబాద్‌లోని ఆర్మీ రిక్రూటింగ్ కార్యాలయానికి (040 27740059)కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. SHARE IT
News March 16, 2025
HYD: ఓయూ క్యాంపస్‌లో ఇవి బంద్!

ఓయూలో ఆందోళనలు, ప్రదర్శనలపై నిషేధం విధిస్తూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేశ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. దీనిని అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నిర్ణయంపై విద్యార్థి సంఘాలు మూకుమ్మడిగా మండిపడుతున్నాయి. శాంతియుతంగా నిరసన తెలుపడం ప్రజాస్వామ్య హక్కు అని, దానిని అణిచివేయాలని చూస్తే పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నాయి.
News March 15, 2025
HYD: భారీగా పెరిగిన నీటి వినియోగం

హైదరాబాద్ మహానగరం రోజు రోజుకూ విస్తరిస్తుండటంతో నీటి వినియోగం కూడా భారీగా పెరిగింది. అవసరాలకు సరిపడా నీరు సరఫరా కాకపోవడంతో ప్రజలు వాటర్ ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. గత సంవత్సరం ఫిబ్రవరిలో 1,12,926 ట్యాంకర్ల నీటిని ఉపయోగించగా ఈ సంవత్సరం ఫిబ్రవరిలో 1,50,000 ట్యాంకర్లు బుక్ చేశారని జలమండలి ఫిబ్రవరి నెలకు సంబంధించి నివేదికలో పేర్కొంది.