News June 21, 2024
HYD: ఇంటర్నేషనల్ యోగా డేలో పాల్గొన్న హీరో నవీన్ చంద్ర

ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలుగు హీరో నవీన్ చంద్ర పాల్గొన్నారు. ఎన్ని కార్యక్రమాలు ఉన్నా, షూటింగ్ ఉన్నా.. ప్రతిరోజు 20 నిమిషాలు యోగాకు కేటాయిస్తానని తెలిపారు. ప్రతి ఒక్కరూ యోగా చేయడం వల్ల బ్యాలెన్స్గా ఉంటారని పేర్కొన్నారు.
Similar News
News November 13, 2025
HYD: ఆస్పత్రికి వెళ్లాలంటే ‘కంటి’ పరీక్ష

సరోజినిదేవి కంటి ఆస్పత్రి.. రోజుకు కనీసం వెయ్యి మంది చికిత్సకు వస్తుంటారు. వీరంతా బస్సు దిగిన తర్వాత (మెహిదీపట్నం వైపు) రోడ్డు దాటాలంటే గుండెలు జారిపోతాయి. వందలాది వాహనాలు రోడ్లపై రయ్ మంటూ దూసుకెళుతుంటాయి. ఆ పరిస్థితుల్లో రోడ్డు దాటడానికి అష్టకష్టాలు పడుతున్నారు. అసలే కంటి సమస్యతో బాధపడుతూ ఆస్పత్రికి వస్తుంటే.. ఈ రోడ్డెలా దాటాలి సారూ అని వాపోతున్నారు. ఓ వంతెన నిర్మించొచ్చు కదా అని కోరుతున్నారు.
News November 13, 2025
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్.. ఇలాగేనా అంతర్జాతీయ స్థాయి నిర్మాణం?

విమానాశ్రయంలా.. ఇంటర్నేషనల్ రేంజ్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను నిర్మిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇపుడు ఆ విషయం మరచిపోయినట్టుంది. రెండేళ్ల క్రితం ప్రారంభించిన ఈ పనులు ఇప్పటి వరకు సగం కూడా కాలేదు. రూ.714 కోట్లతో చేపట్టిన రీ డవలప్మెంట్ పనులు నత్తకే నడక నేర్పిస్తున్నట్లున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని ప్రయాణికులు కోరుతున్నారు.
News November 13, 2025
నాగార్జున- సురేఖ కేసు.. DEC2కు విచారణ వాయిదా

మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు నాగార్జున దాఖలు చేసిన పరువునష్టం కేసు మరోసారి వాయిదా పడింది. HYDలోని ప్రజాప్రతినిధుల కోర్టు విచారణను డిసెంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది. నాగార్జున వ్యక్తిగతంగా హాజరుకాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలతో తన ప్రతిష్ఠ దెబ్బతిందని, అందుకే పరువునష్టం దావా వేసినట్లు నాగార్జున చెప్పిన విషయం తెలిసిందే.


