News June 21, 2024
HYD: ఇంటర్నేషనల్ యోగా డేలో పాల్గొన్న హీరో నవీన్ చంద్ర
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలుగు హీరో నవీన్ చంద్ర పాల్గొన్నారు. ఎన్ని కార్యక్రమాలు ఉన్నా, షూటింగ్ ఉన్నా.. ప్రతిరోజు 20 నిమిషాలు యోగాకు కేటాయిస్తానని తెలిపారు. ప్రతి ఒక్కరూ యోగా చేయడం వల్ల బ్యాలెన్స్‌గా ఉంటారని పేర్కొన్నారు.
Similar News
News September 8, 2024
HYD ఇన్‌స్టాలో పరిచయం.. 20రోజులు ఓయోలో బంధించాడు
హైదరాబాద్‌లో మరో దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. భైంసాకు చెందిన బాలికకు ఇన్‌స్టాలో ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ పరిచయంతో అతడి కోసం ఇక్కడకు వచ్చిన బాలికను నారాయణగూడలోని ఓయో రూమ్‌లో 20 రోజులు బంధించాడు. బాలిక తల్లిదండ్రలకు వాట్సాప్‌లో లొకేషన్ షేర్ చేయడంతో బాధితులు షీటీమ్స్‌ను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు బాలికను విడిపించి నిందితుడిపై కేసు నమోదు చేశారు.
News September 8, 2024
HYD: నిమజ్జనానికి కీలక సూచనలు జారీ
హైదరాబాద్ వ్యాప్తంగా వినాయక చవితి కోలాహలం నడుస్తోంది. ఈ క్రమంలో వినాయక నిమజ్జనానికి సంబంధించి హైదరాబాద్ పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు.
* గణేష్ విగ్రహానికి ఒక వాహనం మాత్రమే అనుమతించబడుతుంది.
* నిమజ్జనం కోసం విగ్రహాన్ని తీసుకెళ్లే వాహనంపై లౌడ్ స్పీకర్ అమర్చకూడదు.* పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు ఇచ్చే సూచనలు పాటించాలి.
News September 8, 2024
HYD: బాధ్యతలు స్వీకరించిన విజయ్ కుమార్
ఇటీవల ఐపీఎస్ బదిలీలో భాగంగా విజయ్ కుమార్ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన ఆదివారం మాజీ డైరెక్టర్ సీవీ. ఆనంద్ నుంచి బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు సీవీ. ఆనంద్ శుభాకాంక్షలు తెలిపారు. కాగా సీవీ హైదరాబాద్ సీపీగా నియమితులయ్యారు.