News March 4, 2025
HYD: ఇంటర్ పరీక్షలు.. ఇది మీ కోసమే!

గ్రేటర్ హైదరాబాద్‌లో ఇంటర్ పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. హైదరాబాద్‌లో 244, రంగారెడ్డిలో 185, మేడ్చల్ మల్కాజిగిరిలో 150 కలిపి మొత్తం 579 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. మూడు జిల్లాల్లో 4,64,445 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. నగరంలోని అన్ని సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. విద్యార్థులకు ఏమైనా సందేహాలు ఉంటే 040-29700934కు కాల్ చేయండి.
SHARE IT
Similar News
News March 19, 2025
సంగారెడ్డి: 24 లోపు పూర్తిచేయాలి: కలెక్టర్

జిల్లాలో ఉపాధి హామీ, పంచాయతీల శాఖల ఆధ్వర్యంలో గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. అభివృద్ధి పనులు ఈనెల 24 లోపు పూర్తిచేయాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్డీఓ జ్యోతి, పంచాయతి రాజ్ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
News March 19, 2025
వడదెబ్బ తాకకుండా ఈ చిట్కాలు పాటించండి

కాటన్ వస్త్రాలను ధరించాలి, బయటకు వెళ్లేటప్పుడు వెంట గొడుగు తీసుకెళ్లండి లేదా టోఫి ధరించండి. రోజుకు 3నుంచి 4లీటర్ల నీరు తప్పనిసరిగా తాగుతూ ఉండాలి. ఎండలో పనిచేసేవారు మరింత అధికంగా నీటిని తీసుకోవాలి. కొబ్బరినీళ్లు, ఉప్పు, పంచదార కలిపిన వాటర్ తీసుకుంటూ ఉంటే శరీరం డీ హైడ్రేట్ కాకుండా ఉంటుంది. పండ్ల రసాలు, మజ్జిగ లాంటివి తాగుతూ ఉండండి. అత్యవసరమైతే తప్ప ఎండలో బయటకి వెళ్లకూడదు.
News March 19, 2025
వనపర్తి జిల్లా ప్రజలకు ముఖ్య గమనిక

సీతారాముల కళ్యాణం తిలకించడానికి భద్రాచలం వెళ్లని వారికి ఆర్టీసీ వారు కార్గో సర్వీస్ ద్వారా ఇంటి వద్దకే తలంబ్రాలు అందించనున్నట్లు వనపర్తి ఆర్టీసీ డీఎం వేణుగోపాల్ తెలిపారు. రూ.151 చెల్లించి రసీదు పొందితే భద్రాచలం సీతారాముల కళ్యాణం తలంబ్రాలను కార్గో సర్వీస్ ద్వారా ఇంటికే చేర్చుతారన్నారు. వివరాల కోసం వనపర్తి-9866344200, పెబ్బేరు-8801828143, కొత్తకోట-8886848518, ఆత్మకూర్-7382829494లో సంప్రదించాలన్నారు.