News March 4, 2025

HYD: ఇంటర్‌ పరీక్షలు.. ఇది మీ కోసమే!

image

గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఇంటర్ పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. హైదరాబాద్‌లో 244, రంగారెడ్డిలో 185, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 150 కలిపి మొత్తం 579 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. మూడు జిల్లాల్లో 4,64,445 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. నగరంలోని అన్ని సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. విద్యార్థులకు ఏమైనా సందేహాలు ఉంటే 040-29700934కు కాల్ చేయండి.
SHARE IT

Similar News

News March 18, 2025

ఓయూలో వచ్చేనెల 8 నుంచి డిగ్రీ కోర్సుల పరీక్షలు

image

ఓయూ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు అధికారులు తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీఎస్‌డబ్ల్యూ, బీబీఏ (రెగ్యులర్), బీబీఏ (బిజినెస్ అనాలటిక్స్), బీబీఏ (రిటైల్ ఆపరేషన్స్), బీబీఏ (లాజిస్టిక్స్), బీబీఏ (ఫ్యాషన్ మేనేజ్మెంట్), బీబీఏ (ఫ్యాషన్ డిజైన్ మేనేజ్మెంట్) కోర్సుల 4, 6 సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్ పరీక్షలు వచ్చేనెల 8వ తేదీ నుంచి జరుగుతాయన్నారు.

News March 17, 2025

పీజీ కోర్సుల వన్ టైం ఛాన్స్ పరీక్షా తేదీ ఖరారు

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పీజీ కోర్సుల వన్ టైం ఛాన్స్ పరీక్షా తేదీని ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ తదితర కోర్సుల మొదటి, మూడో సెమిస్టర్ వన్ టైం ఛాన్స్ బ్యాక్‌లాగ్ పరీక్షలను ఈనెల 18వ తేదీ (రేపు) నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్‌సైట్‌లో చూసుకోవాలని సూచించారు.

News March 17, 2025

HYDలో విద్యార్థులకు కంటి అద్దాల పంపిణీ

image

హైదరాబాద్ జిల్లాలో విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి, దృష్టి లోపం ఉన్నవారికి కంటి అద్దాలు అందిస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. మొత్తం 71,309 మంది విద్యార్థుల్లో 8,849 మందికి కంటి సమస్యలు గుర్తించారు. 7,524 మందికి పునఃపరీక్షలు నిర్వహించి నాణ్యమైన కంటి అద్దాలు పంపిణీ చేశారు. విద్యార్థులు మొబైల్, టీవీ వినియోగాన్ని తగ్గించుకోవాలని సూచించారు.

error: Content is protected !!