News May 11, 2024
HYD: ఇంటర్ ఫెయిల్.. యువతి అదృశ్యం

ఇంటర్ ఫెయిల్ కావడంతో ఓ యువతి అదృశ్యమైంది. పోలీసుల వివరాలు.. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన ఓ కుటుంబం మల్కాజిగిరిలోని రామకృష్ణాపురంలో నివాసం ఉంటుంది. వారి కుమార్తె (19) ఈనెల 9న ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఇంట్లో తల్లికి కుమార్తె రాసిన లేఖ లభించింది. ఇంటర్‌లో ఫెయిల్ అయినందుకు మనస్తాపంతో వెళ్లిపోతున్నట్లు లేఖలో పేర్కొంది. శుక్రవారం తల్లి ఫిర్యాదుతో నేరెడ్‌మెట్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News February 8, 2025
అబిడ్స్ DIపై భార్య ఫిర్యాదు

అబిడ్స్ పోలీస్ స్టేషన్ డీఐ నరసింహపై ఆయన భార్య సంధ్య హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అదనపు కట్నం కోసం మానసికంగా, శారీరకంగా చిత్రహింసలు పెడుతున్నారని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. పెళ్లై 12 ఏళ్లు అవుతుందని, తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, అదనపు కట్నం ఇవ్వకపోతే రెండో పెళ్లి చేసుకుంటానని బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.
News February 8, 2025
కాప్రా: బతికున్నప్పుడు దరఖాస్తు.. చనిపోయాక పెన్షన్

ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ పరిధిలో 2022లో పెన్షన్ కోసం పలువురు వృద్ధులు పలుమార్లు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 191 మంది పెన్షన్ మంజూరైనట్లు సర్కిల్ అధికారులు జాబితా విడుదల చేశారు. ఆ జాబితాలో 32 మంది మృతుల పేర్లు ఉన్నాయని కాప్రా సర్కిల్ అధికార వర్గాల సమాచారం. బతికి ఉన్నప్పుడు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే చనిపోయాక మంజూరు కావడం మున్సిపల్ పరిధిలో చర్చనీయాంశంగా మారింది.
News February 8, 2025
HYD: ఆలుమొగల పంచాయితీలకు కారణాలు అవే..!

HYDలో ఆలుమొగల మధ్య గొడవలు కుటుంబాలలో చిచ్చురేపి, ప్రాణాలు తీస్తున్నాయి. నిత్యం సగటున ఒక్కో PSకు 15 నుంచి 20 వరకు దంపతుల తగాదాల ఫిర్యాదులు వస్తున్నాయి. మానసిక క్షోభ, ఆవేదన, అక్రమ సంబంధాలు, అనుమానం, క్షణికావేశంతో విచక్షణ కోల్పోతున్నారు. 3 కమిషనరేట్ల పరిధిలో ఒక్క ఏడాదిలో దాదాపు 40 మంది గృహిణులు ఆత్మహత్యకు గురయ్యారు, 54 మంది ఆత్మహత్యకు పాల్పడ్డట్లు రిపోర్టు చెబుతోంది.