News July 11, 2024

HYD: ఇంటర్ విద్యార్థి మృతి

image

విద్యుత్ షాక్‌తో ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. స్థానికుల వివరాలు.. RR జిల్లా నందిగామ మండల కేంద్రానికి చెందిన బన్నీ(18) ఇంట్లో ఉన్న నీటి సంపులో మోటార్ ‌కు వైర్లు బిగిస్తున్నాడు. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై కుప్పకూలాడు. అపస్మారక స్థితిలో ఉన్న బన్నీని కుటుంబీకులు షాద్‌నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Similar News

News February 11, 2025

HYD: వేధింపులకు గురిచేస్తున్నారా..ఈ నెంబర్లకు ఫోన్ చేయండి

image

మహిళలు, యువతులు వేధింపులకు గురి అయితే ధైర్యంగా షీ టీమ్‌ని సంప్రదించాలని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. రాచకొండ వాట్సాప్ నంబర్ 8712662111 ద్వారా లేదా మీ ప్రాంత షీ టీమ్‌ అధికారుల నంబర్లు: ఇబ్రహీంపట్నం 8712662600, కుషాయిగూడ 8712662601, ఎల్బీనగర్ 8712662602, మల్కాజ్గిరి 8712662603, వనస్థలిపురం 8712662604, నంబర్లకు వాట్సాప్ ద్వారా నిర్భయంగా ఫిర్యాదు చేయాలన్నారు.  

News February 11, 2025

HYD: మృతుల కుటుంబాలకు మంత్రి సానుభూతి

image

మధ్యప్రదేశ్ జబల్‌పూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు హైదరాబాద్ వాసులు మృతిచెందడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశామన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితులను అక్కడి ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని, సహాయక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

News February 11, 2025

HYD: కన్నీటి ఘటన.. మృతులు వీరే..!

image

ప్రయాగ్ రాజ్ వెళ్లి వస్తుండగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదం విషాదం నింపింది.ఘటనలో HYD నాచారం కార్తికేయ నగర్ ప్రాంతానికి చెందిన 1.శశికాంత్(38),2.మల్లారెడ్డి (60), 3.రవి రాంపల్లి (56), 4.రాజు నాచారం ఎర్రకుంట, 5.సంతోష్ (47), 6.ఆనంద్ రెడ్డి ముసారంబాగ్,7.టీవీ ప్రసాద్ నాచారం గోకుల్ నగర్ మృత్యువాత పడ్డారు.కాగా.. ప్రమాద ఘటనలో 8.నవీన్ చారి,9.బాలకృష్ణకు స్వల్ప గాయాల పాలై ప్రాణాలతో బయటపడ్డారు.

error: Content is protected !!