News January 18, 2025
HYD: ఇంటర్ విద్యార్థుల ALERT.. ఈనెల 25 వరకు అవకాశం
ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులను ఇంటర్మీడియట్ బోర్డు అప్రమత్తం చేసింది. వార్షిక పరీక్షలకు సంబంధించిన ఫీజును ఇప్పటికీ చెల్లించని విద్యార్థులు.. ఆలస్య రుసుం రూ. 2500తో జనవరి 25 వరకు చెల్లించేందుకు అవకాశం కల్పించింది. ఇంటర్ రెగ్యులర్, వొకేషనల్ విద్యార్థులతో పాటు ప్రైవేటు విద్యార్థులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.
Similar News
News January 18, 2025
HYD: త్వరలో 10 స్థానాలకు ఉప ఎన్నికలు: KTR
త్వరలో చేవెళ్ల నియోజకవర్గానికి ఉప ఎన్నిక రాబోతుందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. చేవెళ్లతో పాటుగా పార్టీ మారిన 10 ఎమ్మెల్యేల స్థానాల్లోనూ ఉప ఎన్నికలు జరుగుతాయని, ప్రజలందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 6 గ్యారంటీలు, 420 హామీలు అమలయ్యేంత వరకు BRS పార్టీ నిర్విరామంగా పోరాడుతుందని KTR అన్నారు. కాగా, చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య BRS నుంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్లిన సంగతి తెలిసిందే.
News January 18, 2025
HYD: రాష్ట్రంలో రేవంత్ దోపీడీ ముఠా: కేటీఆర్
రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన దోపీడీ ముఠా రాష్ట్రంలో తిరుగుతుందని మాజీమంత్రి కేటీఆర్ ఆరోపించారు. ప్రగతి భవన్లో చిట్ చాట్లో KTR మాట్లాడుతూ.. రేవంత్ సోదరులతో పాటు ఆరుగురి టీం కంపెనీల నుంచి వసూళ్ల కోసం రేవంత్ రెడ్డి తిప్పుతున్నాడని అన్నారు. తిరుపతిరెడ్డి, కొండల్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, రోనిన్ రెడ్డి, ఫహీం ఖురేషి, ఏవి రెడ్డితో కూడిన ఆలీబాబా అర డజన్ దొంగల గ్యాంగ్ తెలంగాణలో తిరుగుతుందని అన్నారు.
News January 18, 2025
HYD: రేవంత్ విదేశీ పర్యటనపై KTR కామెంట్స్
HYD: సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. గత విదేశీ పర్యటనలో రూ.40 వేల కోట్లు తెలంగాణకి CM చెప్పగా వాటిల్లో ఒక్క 40 పైసలు రాలేదన్నారు. నేను తెలంగాణలో ఎన్ని పరిశ్రమలు తెచ్చానో చెబుతా.. కాంగ్రెస్ వన్ ఇయర్లో ఎన్ని తెచ్చిందో చెప్పగలదా..? మణిపూర్లో పార్టీ మరీనా ఎమ్మెల్యేపై కాంగ్రెస్ వాళ్లు కొట్లాడారన్నారు. హైకోర్టు తీర్పును సైతం స్పీకర్ పాలో అవ్వడం లేదని మండిపడ్డారు.