News August 5, 2024
HYD: ‘ఇంటింటా ఇన్నోవేటర్’ గడువు పొడిగింపు

తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘ఇంటింటా ఇన్నోవేటర్-2024’ కార్యక్రమానికి సంబంధించి దరఖాస్తు గడువును పొడిగిస్తున్నట్లు సంస్థ అధికారులు తెలిపారు. ఎంట్రీలను సమర్పించేందుకు ఈనెల 10 వరకు గడువు పొడిగిస్తున్నట్లు చెప్పారు. సరికొత్త ఆవిష్కరణలు రూపొందించిన వారిని పరిచయం చేస్తూ వాటిని ఈనెల 15న ప్రదర్శిస్తామని వెల్లడించారు. వివరాలకు pr-tsic@telangana.gov.in వెబ్సైట్ చూడాలన్నారు.
Similar News
News November 20, 2025
HYD: బాధితులకు అండగా సైబర్ పోలీసులు

డబ్బు పోగొట్టుకున్న బాధితులకు సైబర్ క్రైం పోలీసులు అండగా నిలిచారు. ఫిర్యాదు స్వీకరించిన మరుక్షణం నుంచే స్పందించి సైబర్ నేరస్థులను అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా వారి నుంచి రూ.63.23 లక్షలు రికవరీ చేసి బాధితులకు అందజేశారు. ఈనెల 12 నుంచి 18వ తేదీ వరకు 18 మంది నిందితులను వివిధ ప్రాంతాల్లో అరెస్టు చేసినట్లు డీసీపీ సాయిశ్రీ తెలిపారు.
News November 20, 2025
HYD: మెట్రోలో వారి కోసం ప్రత్యేక స్కానింగ్

మెట్రోలో భద్రత మా ప్రాధాన్యం అని HYD మెట్రో తెలిపింది. ప్రతి స్టేషన్లో ఆధునిక సీసీటీవీ నిఘా, కఠిన భద్రతా తనిఖీలు అమలు చేస్తూ ప్రయాణికుల రక్షణను మరింత బలపరుస్తున్నట్లు తెలిపింది. ఫేస్మేకర్లు, గుండె రోగులు, గర్భిణీలకు పూర్తిగా సురక్షితమైన స్కానర్లు ఏర్పాటు చేయడం మెట్రో భద్రతా ప్రమాణాలకు నిదర్శనంగా పేర్కొంది.
News November 20, 2025
HYD: పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్

స్థానిక సంస్థల ఎన్నికల ముందే పోలీస్ శాఖలోని 20 వేల పోస్టులతో ఉద్యోగ నోటిఫికేషన్ తక్షణమే ఇవ్వాలని పోలీస్ ఉద్యోగాల నిరుద్యోగ జేఏసీ ప్రతినిధి ఆకాశ్ డిమాండ్ చేశారు. ఈరోజు సోమాజిగూడలో ఆయన మాట్లాడారు. ఏటా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి నిరుద్యోగులను ఆదుకుంటామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం తమను విస్మరించిందన్నారు. జీవో నంబర్ 46ను పూర్తిగా రద్దుచేసి, స్థానిక సంస్థల ఎన్నికలలోపు JOB నోటిఫికేషన్లు ఇవ్వాలన్నారు.


