News December 6, 2024
HYD: ఇంటింటికి కుష్టు వ్యాధి గుర్తింపు సర్వే

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 2నుంచి 15 వరకు 14 రోజుల పాటు ఇంటింటికి కుష్టు వ్యాధి గుర్తింపు సర్వే నిర్వహిస్తున్నట్లు గాంధీ UPHC IDH కాలనీ వైద్యాధికారి డా.ప్రశాంతి తెలిపారు. ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బందితో ఆమె సమావేశం నిర్వహించారు. 2027 కల్లా కుష్టురహిత భారతదేశ లక్ష్యంగా ప్రతి ఒక్కరు పని చేయాలని కోరారు. అనుమానిత మచ్చలు ఉంటే వైద్య సిబ్బందిని కలవాలన్నారు. వనిత, జ్యోతి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
Similar News
News April 14, 2026
HYDలో భారీ మోసం.. ఇద్దరు అరెస్ట్

నగరంలో విదేశీ ఉద్యోగాల పేరుతో జరుగుతున్న భారీ మోసాన్ని జూబ్లీహిల్స్ పోలీసులు బట్టబయలు చేశారు. యూరప్ దేశాల్లో ఉద్యోగాలంటూ ఒక్కో వ్యక్తి నుంచి రూ.4 నుంచి 5 లక్షలు వసూలు చేస్తున్న ‘ట్రివియల్ చాప్టర్’ సంస్థకు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా ప్రకటనలు, నకిలీ ఆఫర్ లెటర్లతో ఈ ముఠా మోసాలకు పాల్పడుతోంది. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
News April 14, 2026
సిద్ధు జొన్నలగడ్డతో Freedom oil కొత్త టీవీ ప్రకటన

Freedom రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ తమ సరికొత్త ప్రచార చిత్రాన్ని ప్రముఖ నటుడు సిద్ధు జొన్నలగడ్డతో విడుదల చేసింది. ‘ఫ్రీడమ్‌తో ఇంటింటా, నెం.1 వంట’ అనే నినాదంతో రూపొందిన ఈ ప్రకటన తెలుగు కుటుంబాల వంటగదిలోని ఆప్యాయతను, సందడిని ఆవిష్కరిస్తోంది. వంట చేయడం అనేది ఒక వేడుక అని చాటిచెప్పే ఈ వీడియోలో సిద్ధు తనదైన శైలిలో ఉత్సాహంగా కనిపించారు. నాణ్యమైన రుచికి Freedom బ్రాండ్ అని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.
News April 14, 2026
మూసీ ప్రక్షాళనకు అడుగులు.. DPR కోసం టెండర్ల ఆహ్వానం

మూసీ నదికి పునర్జీవం పోసేందుకు కసరత్తు మొదలైంది. బాపూఘాట్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు గౌరెల్లి వరకు 34 కిలోమీటర్ల మేర నాలా సీవర్ మళ్లించి, శుద్ధి చేసేలా సమగ్ర ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం DPR తయారీకి MRDCL టెండర్లను ఆహ్వానించింది. గతంలో HMWSSB రూపొందించిన మాస్టర్ ప్లాన్‌ను లోతుగా సమీక్షించి, ఎక్కడైనా లోపాలు లేదా పునరావృత అంశాలు ఉన్నాయో? లేదో? కన్సల్టెంట్ సంస్థ గుర్తించాల్సి ఉంటుంది.


