News April 16, 2025
HYD: ఇంటికి స్వచ్ఛ ఆటో రాలేదా..? ఫిర్యాదు చేయండి!

HYD నగరవ్యాప్తంగా స్వచ్ఛ ఆటో ప్రతి ఒక్కరి ఇంటి వద్దకు వచ్చి చెత్త సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉప్పల్, నాచారం, మల్లాపూర్ సహా అనేక ప్రాంతాల్లో గల్లీలో డే బై డే స్వచ్ఛ ఆటోలు వస్తున్నాయి. అయితే మీ ప్రాంతానికి ఒకవేళ స్వచ్ఛ ఆటో రాకపోతే 040-21111111కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.
Similar News
News December 6, 2025
ఎన్నికలు ముగిసే వరకు కోడ్ అమలు: కలెక్టర్ ప్రావీణ్య

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో మూడు దశల ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి(కోడ్) అమలులో ఉంటుందని సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య శనివారం స్పష్టం చేశారు. మొదటి, రెండో విడత ఎన్నికలు పూర్తయిన గ్రామాల్లో సైతం చివరి దశ ఎన్నికలు పూర్తయ్యే వరకు కోడ్ అమల్లో ఉంటుందని చెప్పారు. ఎవరైనా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News December 6, 2025
ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి: కామారెడ్డి కలెక్టర్

కామారెడ్డి జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ సర్పంచి, వార్డు సభ్యులకు జరుగుతున్న ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులకు వివరించారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మొదటి విడత రిటర్నింగ్ అధికారులు, సహయ జిల్లా ఎన్నికల అధికారులు ఎంపీడీవోలు, తహశీల్దార్‌లతో మాట్లాడారు. ఎన్నికల విధులు సక్రమంగా నిర్వహించాలన్నారు.
News December 6, 2025
నర్సీపట్నంలో రేపు నవోదయ మోడల్ టెస్ట్

PRTU నర్సీపట్నం ఆధ్వర్యంలో నవోదయ మోడల్ టెస్ట్ ఆదివారం ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు PRTU జిల్లా అధ్యక్షుడు గోపీనాథ్ తెలిపారు. శారద నగర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో మోడల్ టెస్ట్ పరీక్షలు ఉంటాయన్నారు. నవోదయ పరీక్షలు రాసే విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. టెస్టులో మొదటి 3 స్థానాల్లో నిలిచిన విజేతలకు బహుమతి ప్రదానం, ప్రశంసా పత్రాలు అందజేస్తామన్నారు.


