News May 3, 2024
HYD: ఇంటి వద్ద ఓటు వేసిన వయోవృద్ధులు
మే 13న రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్ ఉండడంతో వయోవృద్ధులు, సీనియర్ సిటిజన్స్, అనారోగ్యంతో ఉన్నవారి కోసం ఇంటి వద్దనే ఓటింగ్ సౌకర్యాన్ని ఎన్నికల అధికారులు కల్పించారు. ఈ సందర్భంగా శుక్రవారం HYDలోని మలక్‌పేట్ సహా పలు ప్రాంతాల్లో ఎన్నికల అధికారులు వయోవృద్ధుల ఇంటింటికి తిరుగుతూ వివరాలు సేకరించారు. వారితో ఓటు వేయించారు. పూర్తిగా పారదర్శకంగా ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.
Similar News
News November 12, 2024
HYDలో సెక్షన్ 163 పరిధి కుదింపు
ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 27న నుంచి HYD, SEC వ్యాప్తంగా BNSS 163 సెక్షన్ విధించిన సంగతి తెలిసిందే. కాగా.. తాజాగా సచివాలయ పరిధిలో 500 మీటర్ల వరకే BNSS 163(144 సెక్షన్) అమలులో ఉంటుందని పేర్కొంది. సెక్రటేరియట్ పరిసరాల్లో ధర్నాలు, ర్యాలీల నిషేధం అమలు కానుంది. ఇందిరాపార్క్ వద్ద ధర్నా, ర్యాలీలకు అనుమతించింది. తదుపరి ఆదేశాల వరకు ఈ సెక్షన్ అమలులో ఉంటుంది.
News November 12, 2024
HYD: మహిళలు ముందుడం గర్వంగా ఉంది: సుమ
బేగంపేటలో నిర్వహించిన మహిళా ప్రోగ్రాంలో యాంకర్ సుమ పాల్గొన్నారు. సుమ మాట్లాడుతూ.. భారతదేశపు అసలైన నిధి మహిళలే అని అన్నారు. ఆర్థికంగా మహిళా శక్తి ఎదుగుతుండటం తనకు ఎంతో గర్వంగా ఉందని అభిప్రాయపడ్డారు. పోటీ ప్రపంచంలో మహిళలు ముందుండడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని, విద్యతో ఎన్నో సాధించవచ్చన్నారు. మహిళలకు స్వేచ్ఛ ఎంతో అవసరమని పేర్కొన్నారు.
News November 11, 2024
HYD: దేవాలయాల పరిరక్షణకు సీసీ కెమెరాలు
దేవాలయాల పరిరక్షణకు నిర్వాహకులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ పాటిల్ కాంతిలాల్ అన్నారు. దేవాలయాల వద్ద ఇటీవల జరుగుతున్న ఘటనల నేపథ్యంలో సభ్యులతో సమావేశం నిర్వహించారు. దేవాలయాల పరిరక్షణకు నిర్వాహకులు చర్యలు తీసుకోవాలన్నారు. సౌత్ ఈస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ స్వామి, చాంద్రాయణగుట్ట ఏసీపీ మనోజ్ కుమార్, సంతోష్ నగర్ ఏసీపి మహమ్మద్ గౌస్, ఐఎస్ సదన్ ఇన్‌స్పెక్టర్ నాగరాజులు ఉన్నారు.