News June 28, 2024
HYD: ఇంట్లో బిర్యానీ తిని వెళ్లిన దొంగలు..!
చోరీకి వచ్చిన దొంగలు ఇంట్లోని బిర్యానీ తిని వెళ్లిన ఘటన HYD బాలాపూర్ PS పరిధిలో జరిగింది. బాధితులు తెలిపిన వివరాలు.. బాలాపూర్‌లోని నాబెల్ కాలనీలో నివాసం ఉండే ఓ నర్సు తన ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లారు. ఈ క్రమంలో ఇంటి తాళాలు పగలగొట్టిన దొంగలు బీరువాలోని నగదు, బంగారం, వెండి నగలు చోరీ చేశారు. ఫ్రిజ్‌లో ఉన్న బిర్యానీని కిచెన్‌లో వేడి చేసుకుని తిన్నారు. ఇంకా ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
Similar News
News October 8, 2024
HYDRAపై రేపు MLA KVR ప్రెస్‌మీట్
HYD సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్‌లో రేపు మ.12 గంటలకు కామారెడ్డి BJP MLA కాటిపల్లి వెంకట రమణారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు ఓ ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ‘హైడ్రా’ పనితీరు గురించి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడనున్నట్లు తెలిపారు. కాగా ఇప్పటికే హైడ్రా పనితీరును కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్ వ్యతిరేకించిన విషయం తెలిసిందే. మరి KVR ఏం చెబుతారో ఉత్కంఠ నెలకొంది.
News October 8, 2024
HYD: వీడియోలో ఏం తప్పుందో చెప్పాలి: హరీశ్‌రావు
జర్నలిస్టు గౌతమ్ వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. గౌతమ్ షేర్ చేసిన వీడియోలో తప్పేముందో చెప్పాలని ఆయన X ద్వారా డిమాండ్ చేశారు. ప్రజల ఆందోళనలు, బాధలను తెలిపితే అక్రమ అరెస్టులు చేస్తారా అంటూ తెలంగాణ డీజీపీని ఆయన ప్రశ్నించారు.
News October 8, 2024
రైల్వేలో JOBS.. సికింద్రాబాద్‌లో 478 పోస్టులు
దేశవ్యాప్తంగా 8,113 NTPC గ్రాడ్యుయేట్ పోస్టులకు RRB నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగం చేయాలనుకునేవారికి అప్లై చేసేందుకు మరో 5 రోజులే గడువు ఉంది. అక్టోబర్ 13వ తేదీన అప్లికేషన్ గడువు ముగియనుంది. కేవలం మన సికింద్రాబాద్(SCR) రీజియన్‌లోనే 478 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిగ్రీ చేసిన వారు అర్హులు. ఇంగ్లిష్, హిందీ టైపింగ్, కంప్యూటర్‌పై అవగాహన ఉండాలి. ఆసక్తి గలవారు అప్లై చేసుకోవచ్చు.
SHARE IT