News February 15, 2025
HYD: ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎక్కువ దరఖాస్తులు

మహాత్మా జ్యోతిబా ఫులే ప్రజాభవన్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ఆర్జీలు వచ్చాయి. మొత్తం 1,233 దరఖాస్తులు అందాయని అధికారులు తెలిపారు. వీటిలో ఎక్కువ మంది ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కోసం 974 ఆర్జీలు వచ్చాయని ప్రజావాణి కోఆర్డినేటర్ రాకేశ్ రెడ్డి తెలిపారు. సంబంధిత అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చామని తెలిపారు.
Similar News
News February 24, 2026
మార్చి 2న HYDకు రాహుల్ గాంధీ

తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయ సందడి నెలకొంది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ వచ్చే నెల 2న హైదరాబాద్‌కు రానున్నారు. ప్రధానంగా వికారాబాద్ జిల్లాలోని అనంతగిరిలో నిర్వహించనున్న కాంగ్రెస్ శిక్షణా తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులతో (DCC) రాహుల్ గాంధీ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఎన్నికలు, పార్టీ బలోపేతంపై సూచించనున్నారు.
News February 24, 2026
సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌లో జపాన్ టూరిస్టుల సందడి

జపాన్ నుంచి నగరానికి వచ్చిన పర్యాటకులు South India Shopping Mallలో సందడి చేశారు. భారతీయ సంప్రదాయం, ఆధునిక డిజైన్‌లు, విస్తృత కలెక్షన్లు ఒకేచోట లభించడం వారిని ఆకట్టుకున్నట్లు తెలిపారు. దక్షిణ భారత సంప్రదాయ వస్త్రాల నాణ్యత, సరసమైన ధరలు, ఆతిథ్య సేవలు ప్రత్యేకంగా నచ్చాయన్నారు. ‘ఇది జీవితంలో బెస్ట్ షాపింగ్ అనుభవం’ అని వారు పేర్కొన్నారు. విదేశీయులను తమ మాల్ ఆకట్టుకుంటుందని నిర్వాహకులు తెలిపారు.
News February 24, 2026
HYD: నేడు ఆర్టీసీ సంఘాల చలో సెక్రటేరియట్

నేడు ఆర్టీసీ సంఘాలు చలో సెక్రటేరియట్ పిలుపునిచ్చాయి. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, కార్మిక సంఘాల పునరుద్ధరణ, పెండింగ్ బకాయిల చెల్లింపు, ఎలక్ట్రిక్ బస్సులను అద్దె ప్రాతిపదికన కాకుండా సొంతంగా సమకూర్చుకోవడం, ఉద్యోగులపై పని ఒత్తిడి, ఖాళీల భర్తీ తదితర డిమాండ్లతో నిరసన వ్యక్తం చేయనున్నాయి. దీర్ఘకాలంగా ఉన్న ఈ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించడం లేదంటూ చలో సెక్రటేరియట్‌కు పిలుపునిచ్చయి.


