News August 19, 2024
HYD: ఇందిర మహిళా శక్తికి GHMC శ్రీకారం

ఇందిర మహిళా శక్తి కార్యక్రమానికి GHMC శ్రీకారం చుట్టింది. గ్రేటర్ పరిధిలోని మహిళలతో మార్చి 31, 2025లోపు 7 వేల సంస్థలను ఏర్పాటు చేయాలని బల్దియా నిర్ణయించింది. ఆధునిక మార్కెట్‌కు తగ్గట్టు లాభాలను ఆర్జించే వ్యాపారాలతో అధికారులు జాబితా రూపొందించారు. స్వయం సహాయక బృందాల మహిళలను కోటీశ్వరులను చేయడమే ఈ పథక ముఖ్యోద్దేశం. ఆ మేరకు ప్రభుత్వం ఇచ్చిన ప్రణాళికను సిద్ధం చేసుకున్నామని అధికారులు చెప్పారు.
Similar News
News November 23, 2025
బహ్రెయిన్- HYD విమానానికి బాంబు బెదిరింపు కాల్

బహ్రెయిన్- HYD GF 274 విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. వెంటనే అలర్ట్ అయ్యి శంషాబాద్‌కు రావాల్సిన విమానాన్ని ముంబైకి డైవర్ట్ చేశారు. తెల్లవారుజామున 4:20కి ఫ్లైట్ అక్కడ సేఫ్‌గా ల్యాండ్ అయింది. విమానం అంతటా CISF, భద్రతా బలగాలు విస్తృతంగా తనిఖీలు చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోనూ అలర్ట్ చేయగా ప్రయాణికులు ఆందోళన చెందారు. ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి.
News November 23, 2025
HYD: ఇవాళ ఫ్యూచర్ సిటీకి సీఎం రేవంత్ రెడ్డి

ఇవాళ మద్యాహ్నం ఫ్యూచర్ సిటీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. DEC 8 నుంచి 11వ తేది వరకు భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్- 2025ను నిర్వహిస్తోంది. పనుల ఏర్పాట్లను పలువురు మంత్రులు, అధికారులతో కలిసి సీఎం పరిశీలించనున్నారు. రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్ పేటలో 300 ఎకరాల విస్తీర్ణంలో సమ్మిట్ నిర్వహణ ఏర్పాట్లు చేశారు. దీనికి 3వేల మంది అతిథులు రానున్నట్లు అధికారులు ఇప్పటికే ప్రకటించారు.
News November 23, 2025
HYD: సైబర్ నేరాలపై ప్రతిజ్ఞ చేయించిన సీపీ

సైబర్ నేరాల నివారణ కోసం ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని సీపీ సజ్జనార్ అన్నారు. శనివారం చార్మినార్ ప్రాంగణంలో ‘జాగృత్ హైదరాబాద్- సురక్షిత్ హైదరాబాద్’ పేరుతో సైబర్ నేరాల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మోసపూరిత లింక్‌ను ఓపెన్ చేయబోమని ప్రతిజ్ఞ చేయించారు. ఒకవేళ సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930, సైబర్ పోర్టల్ www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలన్నారు.


