News March 23, 2024
HYD: ఇది అత్యంత కఠినమైన జాబ్: CV ఆనంద్

ఇటీవల కాలంలో రాష్ట్రంలో ACB దాడుల్లో వరుసగా ప్రభుత్వాధికారులు పట్టుబడుతున్నారు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ACB DG సీవీ ఆనంద్ ప్రస్తుతం తన ఉద్యోగాన్ని ఆస్వాదిస్తున్నారని ట్వీట్ చేశారు. దీనికి సీవీ ఆనంద్ స్పందిస్తూ.. “తప్పు చేసిన అధికారులను పట్టుకుని జైలుకు పంపడం అత్యంత కఠినమైన జాబ్. ప్రభుత్వాధికారులు ఎలాంటి అవినీతికి పాల్పడకుండా ప్రజాసేవ చేస్తారని ఆశిస్తున్నాను” అని అన్నారు.
Similar News
News October 29, 2025
జూబ్లీహిల్స్ బైపోల్: ఈవీఎంల రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ఏర్పాట్లలో భాగంగా బుధవారం కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో రెండో విడత ఈవీఎంల ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు. జనరల్ అబ్జర్వర్ రంజిత్ కుమార్ అధ్యక్షతన పరిశీలన జరిగింది. రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో ఈసీఐ మార్గదర్శకాల మేరకు పారదర్శకంగా ప్రక్రియ కొనసాగింది.
News October 29, 2025
జూబ్లిహిల్స్ బై పోల్స్.. ఎన్నికల నిర్వహణలో ఇవీ గణాంకాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నిర్వహణకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. నోటాతో కలిపి 59 మంది అభ్యర్థుల పేర్లను 407 పోలింగ్ బూత్‌లలో బ్యాలెట్ యూనిట్లలో (ప్రతి పోలింగ్ బూత్‌లో నాలుగు) అమర్చుతారు. 20 శాతం అదనంగా కలిపి 1954 బ్యాలెట్ యూనిట్లను ఉపయోగిస్తారు. ఇక 509 కంట్రోల్ యూనిట్లు, 509 వీవీ ప్యాట్లు వాడనున్నారు. ఇవన్నీ ఇపుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేసిన డీఆర్సీలో ఉన్నాయి.
News October 29, 2025
తుఫాన్ ఎఫెక్ట్: HYDలో BSP ధర్నా వాయిదా

బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని నవంబర్ 1న ఛలో ఇందిరా పార్క్ కార్యక్రమానికి బీఎస్పీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే మొంథా తుఫాన్ కారణంగా ధర్నా కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాంశేఖర్ తెలిపారు. తదుపరి ధర్నా తేదీని త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు.


