News January 24, 2025
HYD: ఇన్‌స్టాలో అశ్లీల వీడియోలు.. ARREST

ఇన్‌స్టాలో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి చిన్నారుల అశ్లీల నృత్యాలు షేర్ చేసిన HYD వాసులు అరెస్ట్ అయ్యారు. ఇద్దరు ప్రైవేట్ ఉద్యోగులు, ఓ వ్యాపారి పోర్న్ చూస్తున్నారు. చిన్నారుల అశ్లీల వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. గుర్తించిన NCMEC(National Center for Missing & Exploited Children) సైబర్ క్రైమ్ PSలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురిని గురువారం అరెస్ట్ చేశారు.
Similar News
News February 15, 2025
HYD: 17న KCRపై స్పెషల్ సీడీ: తలసాని

ఈనెల 17న బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కేంద్ర కార్యాలయంలో కేక్‌కట్ చేసిన అనంతరం కేసీఆర్ జీవిత విశేషాలతో ప్రత్యేక సీడీ విడుదల చేస్తామన్నారు.
News February 15, 2025
రంగారెడ్డి: అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం

రంగారెడ్డి కలెక్టరేట్లో తాగునీటి సరఫరాపై ఆ శాఖ అధికారులతో కలెక్టర్ నారాయణ రెడ్డి శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో నీటి సరఫరాలో ఎదురవుతున్న ఇబ్బందులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
News February 15, 2025
HYD: అవినీతికి పాల్పడితే కాల్ చేయండి: ACB

గచ్చిబౌలి ఏడీఈ సతీష్ లంచం తీసుకుంటూ ఇటీవల ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు అవినీతికి పాల్పడితే వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు సమాచారం అందించాలని సూచించారు. లేదా వాట్సప్ నంబర్ 9440446106కు సమాచారం అందించాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.