News January 24, 2025

HYD: ఇన్‌స్టాలో అశ్లీల వీడియోలు.. ARREST

image

ఇన్‌స్టాలో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి చిన్నారుల అశ్లీల నృత్యాలు షేర్ చేసిన HYD వాసులు అరెస్ట్ అయ్యారు. ఇద్దరు ప్రైవేట్ ఉద్యోగులు, ఓ వ్యాపారి పోర్న్ చూస్తున్నారు. చిన్నారుల అశ్లీల వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. గుర్తించిన NCMEC(National Center for Missing & Exploited Children) సైబర్ క్రైమ్‌ PSలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురిని గురువారం అరెస్ట్ చేశారు.

Similar News

News October 29, 2025

జమ్మికుంట: మార్కెట్‌కు 4 రోజులు సెలవులు

image

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌కు 4 రోజులు సెలవులు ప్రకటించామని మార్కెట్ ఛైర్ పర్సన్ పుల్లూరి స్వప్న, ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం తెలిపారు. తుఫాన్ కారణంగా ఖరీదారులు, అడ్తిదారుల విన్నపం మేరకు ఈనెల 30, 31, NOV 1న మార్కెట్ యార్డుకు మూడు రోజులు సెలవు, ఆదివారం సాధారణ సెలవు ఉంటుందని పేర్కొన్నారు. CCI ద్వారా యధావిధిగా క్రయవిక్రయాలు జరుగుతాయని పేర్కొన్నారు. రైతులు, వ్యాపారులు, కార్మికులు గమనించాలన్నారు.

News October 29, 2025

పాక్‌కు చెంపపెట్టులాంటి ఫొటో.. శివాంగీతో ముర్ము

image

అంబాలా ఎయిర్ బేస్‌లో రఫేల్‌ రైడ్‌ తర్వాత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్క్వాడ్రన్ లీడర్ శివాంగీ సింగ్‌తో ఫొటో దిగారు. శివాంగీ రఫేల్ ఫస్ట్ ఇండియన్ ఉమెన్ పైలట్. కాగా ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత రఫేల్ జెట్లు కూల్చేశామన్న పాక్.. పైలట్ శివాంగీని ప్రాణాలతో బంధించామని ప్రచారం చేసింది. కానీ ఇవాళ రాష్ట్రపతి ఆమెతో ఫొటో దిగి పాక్‌ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టారు. ఈ ఫొటో దాయాదికి చెంపపెట్టులాంటిదనే చెప్పాలి.

News October 29, 2025

జూబ్లిహిల్స్ బై పోల్స్.. ఎన్నికల నిర్వహణలో ఇవీ గణాంకాలు

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నిర్వహణకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. నోటాతో కలిపి 59 మంది అభ్యర్థుల పేర్లను 407 పోలింగ్ బూత్‌లలో బ్యాలెట్ యూనిట్లలో (ప్రతి పోలింగ్ బూత్‌లో నాలుగు) అమర్చుతారు. 20 శాతం అదనంగా కలిపి 1954 బ్యాలెట్ యూనిట్లను ఉపయోగిస్తారు. ఇక 509 కంట్రోల్ యూనిట్లు, 509 వీవీ ప్యాట్లు వాడనున్నారు. ఇవన్నీ ఇపుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేసిన డీఆర్సీలో ఉన్నాయి.