News March 18, 2025

HYD: ఇమ్రాన్‌ ఖాన్‌కు ‘పరేషాన్’!

image

ఇమ్రాన్‌ ఖాన్‌కు ‘పరేషాన్’ తప్పడం లేదు. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేశారని పంజాగుట్టలో ఇతడిపై కేసు నమోదైంది. సెలబ్రిటీల ఇల్లీగల్ ప్రమోషన్స్ పట్ల నెటిజనులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇన్‌స్టాలోనూ పలువురు HYD ఇన్‌ఫ్లూయెన్సర్లు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేశారు. పోలీసుల చర్యలకు భయపడి ఆ వీడియోలు డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ యాప్స్ వ్యవహారంలో ఇమ్రాన్‌ ఖాన్‌ను అరెస్ట్ చేస్తారనే వార్తలు వస్తున్నాయి.

Similar News

News November 14, 2025

ఒంటరిగా వెళుతున్న ఎంపీ.. కలిసిరాని ఎమ్మెల్యేలు!

image

కాకినాడ MP ఉదయ శ్రీనివాస్ జిల్లాలో ఒంటరిగానే పర్యటనలకు వెళ్తున్నారు. కాకినాడ(R)లో జనసేన MLA ఉన్నప్పటికీ ఆయన కూడా ఎంపీతో కలవడం లేదట. పిఠాపురంలో మాజీ MLA దొరబాబు మాత్రమే MP వెంట వస్తున్నారు. మాజీ MLA వర్మ, సిటీ ఎమ్మెల్యే కొండబాబుతో ఈయనకు విభేదాలున్నాయి. మిగతా చోట్ల కూడా MLAలు సహకరించడం లేదని, MP కూడా కలుపుగోలుతనంగా ఉండరనే టాక్ ఉంది. దీంతో MP నిధులతో చేపట్టే పనులకు ఆయనే శంకుస్థాపనలు చేసుకుంటున్నారు.

News November 14, 2025

విశాఖ చేరుకున్న ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్

image

ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ శుక్రవారం విశాఖ చేరుకున్నారు. ఐఎన్ఎస్ డేగాలో రాధాకృష్ణన్‌కు గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రి నారా లోకేశ్ స్వాగతం పలికారు. కాసేపట్లో సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ జరిగే ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ ప్రాంగణానికి ఉపరాష్ట్రపతి చేరుకొని సదస్సును ప్రారంభించనున్నారు.

News November 14, 2025

బిజినేపల్లిలో 12.7 డిగ్రీల కనిష్ఠం

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో అత్యల్పంగా బిజినపల్లి, తెలకపల్లి మండల కేంద్రాలలో 12.7 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. అమ్రాబాద్‌లో 12.8, వెల్దండ 12.9, ఊర్కొండ 13.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం వేళల్లో చలి కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.