News June 23, 2024
HYD: ఇలా బండి నడిపితే మూడేళ్లు జైలుకే..!
గ్రేటర్ HYD వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చారు. ఇక నుంచి రాంగ్ రూట్‌లో వాహనం నడిపితే మూడేళ్లు జైలు శిక్ష అనుభవించాల్సిందేనని హెచ్చరించారు. రాంగ్ రూట్‌లో వాహనాలు నడపడం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, వీటిని కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రమాదాలను నివారించేందుకు రాంగ్ రూట్ డ్రైవర్లపై ప్రత్యేక దృష్టి సారించామని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. SHARE IT
Similar News
News November 15, 2024
HYD: ఓపెన్ డిగ్రీ, PG చేయాలనుకునేవారికి నేడు లాస్ట్ ఛాన్స్!
డా.బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ, పీజీ కోర్సుల్లో చేరడానికి ఈ నెల 15 వరకు అవకాశం ఉందని విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు. వర్సిటీలో చేరిన ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ట్యూషన్ ఫీజు, అంతకు ముందు వర్సిటీలో చేరి ఫీజు చెల్లించలేకపోయిన విద్యార్థులు సైతం శుక్రవారం www.braou.ac.in ఆన్‌లైన్‌లో చెల్లించాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.SHARE IT
News November 15, 2024
HYD: GHMC ఎన్నికల నాటికి విలీనం జరిగేనా..?
జీహెచ్ఎంసీ పాలకమండలి గడవు 2026 ఫిబ్రవరి 10తో ముగియనుంది. ORR వరకు 4 గ్రేటర్ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని ఇటీవలే మంత్రి వెంకటరెడ్డి అన్నారు. ఇప్పటికే.. ORR లోపలి 51 గ్రామాలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. అధికారులు గ్రౌండ్ వర్క్ ప్రారంభించారు. మరీ 2026 GHMC ఎన్నికల నాటికి మున్సిపాలిటీల విలీనం, కార్పొరేషన్ల ఏర్పాటు జరుగుతుందో వేచి చూడాలి.
News November 14, 2024
HYD: మీకు చికెన్, మటన్ షాప్ ఉందా..? జాగ్రత్త..!
HYDలో వేలాదిగా చికెన్, మటన్ షాపులు కొనసాగుతున్నాయి. అనేక చోట్ల పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంపై జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదులు అందాయి. చికెన్ కట్ చేసే సమయంలో ఈగలు వాలటం, అపరిశుభ్రత కారణంగా పలువురు అస్వస్థత గురయ్యారు.దీనిపై జీహెచ్ఎంసీ వెటర్నరీ, హెల్త్ అధికారులు తనిఖీలు చేసి జరిమానా విధించారు. షాప్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.