News September 26, 2024

HYD: ఇళ్లకు ‘RB-X’ మార్కింగ్..!

image

మూసీ నది ప్రక్షాళనలో భాగంగా <<14199043>>ఇళ్లు కోల్పోయే వారికి<<>> పునరావాసం కల్పించేందుకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా అధికారులు చర్యలు చేపట్టారు. అర్హులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇచ్చేందుకు రీ సర్వే చేస్తున్నారు. ఓనర్ల నుంచి ఇంటి పత్రాలు, ఇతర వివరాలు సేకరిస్తున్నారు. డిప్యూటీ కలెక్టర్ శివకుమార్, తహశీల్దార్లు సంధ్యారాణి, అహల్య ఆధ్వర్యంలో కూల్చివేసే ఇళ్లకు RB-X పేరిట మార్కింగ్ చేస్తున్నారు.

Similar News

News October 4, 2024

HYDలో T20 మ్యాచ్.. భారీ బందోబస్తు

image

ఈ నెల 12న ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో భారత్ VS బంగ్లాదేశ్ మధ్య T20-2024 క్రికెట్ మ్యాచ్ జరగనుంది. అందుకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను రాచకొండ CP సుధీర్ బాబు పరిశీలించారు. అనంతరం DCPలు, ACPలు, HCA ప్రెసిడెంట్ జగన్‌ మోహన్‌తో సమావేశం నిర్వహించారు. క్రికెట్ అభిమానులకు అసౌకర్యం కలగవద్దని, T20 మ్యాచ్ నిర్వహణకు పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు CP సుధీర్ బాబు వెల్లడించారు.

News October 4, 2024

HYD: అమ్మవారి ఫేమస్ ఆలయాలకు మీరు వెళ్లారా?

image

HYD,ఉమ్మడి RRలోని ప్రసిద్ధ అమ్మవారి ఆలయాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్ మహంకాళమ్మ, జూబ్లీహిల్స్ పెద్దమ్మ, బల్కంపేట్ ఎల్లమ్మ, శామీర్‌పేట్ కట్ట మైసమ్మ, చార్మినార్ భాగ్యలక్ష్మీ, గోల్కొండ జగదాంబిక, లాల్‌దర్వాజ సింహవాహిని,మైసిగండి మైసమ్మ, కొత్తపేట అష్టలక్ష్మీ, బోడుప్పల్ నిమిషాంబిక ఆలయాల్లో వివిధ రూపాల్లో మాతలు దర్శనమిస్తున్నారు. మరి ఈఆలయాలకు మీరు వెళ్లారా కామెంట్ చేయండి.

News October 4, 2024

BREAKING: HYD: విషాదం.. ముగ్గురు చిన్నారులు మృతి

image

మేడ్చల్ జిల్లాలో కాసేపటి క్రితం విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. శామీర్‌పేట్ పరిధి మూడుచింతలపల్లి మండలం కొల్తూరు చెరువులో పడి ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. దసరా సెలవుల నేపథ్యంలో హర్ష, మణికంఠ, మనోజ్ ఇంటి దగ్గర నుంచి ఆడుకుంటూ చెరువు వద్దకు వెళ్లారు. అక్కడ ఈత కొడదామని దిగి ఊపిరాడక చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. > సెలవు రోజుల్లో పిల్లలు జర జాగ్రత్త..!